Assam tea business

 అస్సాం టీ పొడి వ్యాపారాన్ని ప్రారంభించడం ఎలా :-

అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము. 

వ్యాపారానికి సంబంధించిన అడ్రస్ లను అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తూ వస్తున్నాము.

ఈరోజు అస్సాం టీ పొడి వ్యాపారం ఎలా చేయాలి అస్సాం టీ పొడికి మార్కెట్లో డిమాండ్ ఎలా ఉంటుంది అలాగే టీ పొడి విక్రయించడం ద్వారా ఎంత ఆదాయాన్ని సంపాదించగలరు అనే విషయాలతో పాటుగా టీ పొడి వ్యాపారానికి ఎంత పెట్టుబడి అవుతుంది అనే విషయాలపై పూర్తిగా అవగాహనతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

హోల్ సేల్ గా చేయగలిగే వ్యాపారాల్లో అస్సాం టీ పొడి వ్యాపారం చాలా అద్భుతమైన వ్యాపారం. 

ఎందుకంటే హోల్సేల్గా కంపెనీ నుండి  టీ పొడిని కొనుగోలు చేస్తే ఒక కేజీ 140 రూపాయల నుండి 150 రూపాయల వరకు మనకు హోల్సేల్ మార్కెట్లో దొరుకుతుంది. 

మనము కొనుగోలు చేసిన టీ పొడిని ఒక కేజీ 250 నుండి 350 వరకు విక్రయించవచ్చు. 

మనం ఉంటున్న ఊర్లో ఎన్నో టీ స్టాల్స్ ఉంటాయి వారందరూ అస్సాం టీ పొడిని వినియోగిస్తూ ఉంటారు.

ఈ పొడిలో మూడు రకాలు ఉంటాయి. 

మొదటి రకం ఆకుల రూపంలో ఉంటుంది. 

రెండవ రకం గుండ్లు గుండ్లు గా ఉంటుంది. 

మూడో రకం సన్న పొడి రూపంలో ఉంటుంది. 

మార్కెట్లో టీ స్టాల్స్ వారు ఎక్కువగా పొడి రూపంలో ఉండే టీ పొడి వాడుతూ ఉంటారు. 

టీ పొడి తక్కువగా పడుతుంది కనుక ఇలాంటివి పొడిని మనము హోల్ సేల్ గా కొనుగోలు చేయవలసి ఉంటుంది.

ఒక కేజీకి మనకు 150 రూపాయల ఆదాయం ఉంటుంది.

ప్రతిరోజు మనము ఎన్ని కేజీలు వేయించగలిగితే అంత ఆదాయం ఉంటుంది కనుక టీ పొడి వ్యాపారం మంచి వ్యాపారం అంటున్నాను. 

పెట్టుబడి విషయానికి వస్తే టీ పొడి వ్యాపారాన్ని 20 వేల రూపాయల పెట్టుబడితో ప్రారంభించవచ్చు. 

ఆ తరువాత వ్యాపారం పెరిగేకొద్దీ పెట్టుబడులు పెంచుకో వలసి వస్తుంది. 

అలాగే టీ పొడి కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా హోల్సేల్ డీలర్ల వద్ద నుండి కొనుగోలు చేయండి. 

మీరు టీ పొడి బల్క్ గా కొనుగోలు చేయవలసి వస్తే ఇండియన్ మార్ట్ వెబ్ సైట్ ద్వారా హోల్ సేల్ వ్యక్తులతో మాట్లాడి అస్సాం టీ పొడి హోల్ సేల్ గా కొనుగోలు చేయవచ్చ. 

ఇండియన్ మార్ట్ లో చాలా హోల్ సెల్ కంపెనీ అడ్రస్ లు వారి ఫోన్ నెంబర్లు ఉంటాయి వారితో మాట్లాడి మనకు కావలసిన టీ పొడి ఎంత రేటు విక్రయిస్తున్నారు తెలుసుకుని కొనుగోలు చేయవలసి ఉంటుంది. 

అలాగే వ్యాపారాన్ని ప్రారంభించే ముందు అస్సాం టీ పొడి వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకొని మీరు కొనుగోలు చేసే హోల్సేల్ టీ పొడి డీలర్ల వద్దకు వెళ్లి వారితో డైరెక్ట్ గా మాట్లాడి  క్వాలిటీ చెక్ చేసుకుని వారు మనకు టి పొడి ని ఎలా పంపిస్తారు అనే విషయం కూడా తెలుసుకొని వారి వద్ద నుండి సరుకు కొనుగోలు చేయవచ్చు. 

మీరు హోల్సేల్ డీలర్ల వద్దకు వెళ్లకుండా ఆన్లైన్లో టీ పొడి కొనుగోలు చేయవద్దు ఎందుకంటే మనము క్వాలిటీ చూసిన తర్వాతనే కొనుగోలు చేయాలి కనుక కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు ఇండియన్ మార్ట్ వెబ్ సైట్ లోకి వెళ్లి హోల్సేల్ అడ్రస్ లన్నీ సేకరించి వారితో మాట్లాడి ఎవరు రేటు అనుకూలంగా ఇస్తే వారి వద్ద నుండి కొనుగోలు చేయవచ్చు.

తెలుగు రాష్ట్రాలలో హోల్సేల్ డీలర్ లు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ఏరియా లో ఉన్నావారు వ్యాపారం ప్రారంభించే ముందు మీకు దగ్గరలోని షాపుల వారితో కూడా మాట్లాడండి ఎలాంటి క్వాలిటీ పొడిని వారు విక్రయిస్తున్నారు తెలుసుకోవడం చాలా ముఖ్యం అప్పుడే మనము డైరెక్టుగా అమ్ముడుపోయే టీ పొడిని కొనుగోలు చేయవచ్చు. 

టీ పొడి వ్యాపారం ఒకరు ఒక అవగాహనతో చేస్తూ ఉంటారు మీకున్న అవగాహన తో పాటు ఎవరైనా సలహా ఇస్తే వారి సలహాలు కూడా తీసుకొని ఏది బెస్ట్ గా ఉంటే ఆ విధానంలో వ్యాపారం చేస్తూ అభివృద్ధి చెందవచ్చు.


వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గానే పూర్తి సమాచారం తెలుసుకోవాలి అలాగే వ్యాపారం గురించి కూడా సమస్త సమాచారంతో ప్రారంభించాలి.





కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఇవ్వండి.

***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close