ఉల్లిపాయల వ్యాపారం గురించి తెలుసుకుందాం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము వ్యాపారానికి సంబంధించిన అడ్రస్ లను అదనపు సమాచారాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
ఈరోజు ఉల్లిపాయల వ్యాపారం గురించి తెలుసుకుందాం.
చాలామంది నన్ను అడుగుతున్నారు సార్ మేము లోకల్ లో ఉల్లిపాయలు ఎక్కువ రేటు పడుతుంది హోల్ సేల్ గా ఉల్లిపాయలను ఎక్కడినుండి కొనాలి తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయల మార్కెట్లో ఎక్కడ ఉన్నాయి అని అందరూ అడుగుతున్నారు.
ఫ్రెండ్స్ ఉల్లిపాయల వ్యాపారం చాలా మంచి వ్యాపారం ఎప్పుడూ జరుగుతూ ఉండే వ్యాపారం.
ఎందుకంటే ఉల్లిపాయలు లేనిది ఎటువంటి హోటల్స్ నడవలేరు అలాగే ప్రతి వ్యక్తి తను తీసుకునే ఆహారంలో ఉల్లి కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు కనుక ఉల్లిపాయల వ్యాపారం మీరు ఎక్కడ ఏ ఊరిలో ప్రారంభించిన అద్భుతంగా వ్యాపారం జరుగుతుంది.
కనుక మీరు కొనుగోలు మెలకువలు పాటించి వ్యాపారాన్ని బాగా అభివృద్ధి పంచుకోవచ్చు.
బాగా జరిగే ఈ వ్యాపారం ద్వారా మనకు ఆదాయం కూడా బాగా ఉంటుంది కనుక ఉల్లిపాయల వ్యాపారం ఎంతో ఆదాయంతో కూడుకున్న వ్యాపారం.
ఉల్లిపాయలను మీరు లోకల్ లో కొనుగోలు చేయడం వల్ల ఒక బస్తా కు వంద రూపాయల నుండి రెండు వందల రూపాయల వరకు ఎక్కువ రేటు ఇచ్చి కొనవలసి ఉంటుంది.
దీనివల్ల రోజు 10 నుండి 20 బస్తాలు అమ్మే వ్యక్తులు ఎంత నష్టపోతారు అనే విషయం మనకు అర్థం అవుతుంది.
కనుక ఉల్లిపాయలు విక్రయించే వ్యక్తులు వారు విక్రయించే బస్తాలు ఎన్ని అనే బేరీజు వేసుకోవాలి.
ఎక్కువగా విక్రయించే వ్యక్తులు కచ్చితంగా హోల్సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేయండి లేకపోతే మీరు ప్రతిరోజు రెండు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల ఆదాయాన్ని మీరు ఉంటున్న ఊర్లో కొనడం వల్ల నష్టపోతూ ఉంటారు.
అలా కాకుండా మీరు హోల్సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేస్తే మీకు చాలా తక్కువ రేటుకు వస్తాయి కనుక మీకు మంచి ఆదాయం ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్లో ఉల్లిపాయల హోల్సేల్ మార్కెట్ కర్నూల్ లో ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు మార్కెట్ ఉల్లిపాయలకు పెద్ద మార్కెట్ అలాగే హైదరాబాదులో మలక్పేట్ మార్కెట్ ఉంది తెలంగాణ వారు హైదరాబాద్ నుండి కొనుగోలు చేయవచ్చు.
ఈ రెండు మార్కెట్లలో రైతులు ఉల్లిపాయలను వేలంపాట ద్వారా విక్రయిస్తుంటారు మీరు డైరెక్టుగా వేలంపాట లో పాల్గొనవచ్చు.
కొనుగోలు చేసిన ఉల్లిపాయలను లారీల ద్వారా మీ ఊరికి ట్రాస్పోర్ట్ చేయవలెను.
రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం వల్లనే మనకు మంచి ఆదాయం ఉంటుంది.
నేను 20 బస్తాల ఉల్లిపాయలు అమ్మగలను అనే వ్యక్తులు కచ్చితంగా హోల్సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేయండి.
మీరు ప్రతి వారము ఒక పెద్ద లారీ ఉల్లిపాయలు కొనుగోలు చేయవలసి ఉంటుంది.
ఇలా కొనుగోలు చేయడం వల్లనే మనకు ఎంతో ఆదాయం ఉంటుంది.
ఈ వ్యాపారాన్ని ఎప్పటినుండో చేస్తున్న వ్యక్తులు వారికి అన్ని విషయాలు తెలిసేఉంటాయి కనుక వారికి ఎటువంటి సలహాలు అవసరం లేదు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే వ్యక్తులు ఉల్లిపాయల వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి అప్పుడే ఆ వ్యాపారం లోని మెలుకువలు మీకు అర్థం అవుతాయి అప్పుడు మీరు వ్యాపారాన్ని ఏ ఊరు నుండి ఐనా ప్రారంభించవచ్చు.
వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకోండి.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members