A4 పేపర్ బిజినెస్ ఎలా చేయాలి తెలుసుకుందాం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము వ్యాపారానికి సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము.
ఈరోజు A4 పేపర్ ఎలా తయారు చేయాలి మిషనరీ కి ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఆదాయం ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం.
వ్యాపారాన్ని అయ్యే ఖర్చు :-
ఈ వ్యాపారాన్ని మీరు మీ ఊరు నుండి అలాగే మీ ఇంటి నుండి ప్రారంభించవచ్చు.
మీ ఇంటి నందు చిన్న రూము ఉంటే సరిపోతుంది.
ఇలా ఇంటి నుండి వ్యాపారం చేస్తే రూముకు అద్దె అవసరం ఉండదు కనుక రూము అద్దె కర్చు కూడా మనకు మిగులుతుంది.
అలాగే ఏ A4 షీట్ తయారు చేయాలి అంటే మనకు పేపర్ రోన్ అలాగే మేకింగ్ మిషన్ అవసరమవుతుంది.
ఈ మిషన్ కు సంబంధించిన సమాచారాన్ని ఇండియన్ మార్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే A4 షీట్ పేపర్లు తయారు చేయాలి అంటే GSM A4 పేపర్ రోల్స్ అవసరమవుతాయి.
పేపర్ రోల్ మేకింగ్ మిషన్ ఐదు లక్షలనుండి ప్రారంభమవుతుంది.
అలాగే పేపర్ రోల్స్ మన వ్యాపారాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొనుగోలు చేయవలసి వస్తుంది.
ఆదాయం :-
ఈ వ్యాపారానికి ప్రతిరోజు 4 వేల రూపాయల నుండి 8 వేల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది.
కనుక ఈ వ్యాపారం చాలా మంచి వ్యాపారం గా భావించాలి.
A4 పేపర్ ఒక బండిలు మనకు వంద రూపాయల దాకా ఖర్చు అవుతుంది మార్కెట్లో హోల్ సేల్ గా 180 రూపాయల వరకు విక్రయిస్తారు కనుక ప్రతిరోజు మనము ఎన్ని బండల్ అమ్మగలిగితే అంత ఆదాయం ఉంటుంది.
ఉదాహరణకు ప్రతిరోజు 50 బండిల్స్ అమ్మగలిగితే 4 వేల రూపాయలు అలాగే 100 బండిల్స్ అమ్మగలిగితే 8 వేల రూపాయలు ఆదాయం ఉంటుంది.
వ్యాపారం చేసే విధానం :-
ఏ వ్యాపారం అయినా మనము ప్రారంభించే ముందుగానే ఆ వ్యాపారం గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలి అప్పుడే మనం ఆ వ్యాపారంలో అద్భుతంగా రాణించగలము.
కనుక వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకుందాం.
మీరు వ్యాపారాన్ని ప్రారంభించకముందే A4 పేపర్ బండిల్స్ ఎవరు ఎక్కువగా వాడుతున్నారు అలాగే మనం తయారు చేస్తే మన దగ్గర నుండి హోల్ సేల్ గా కొనేది ఎవరు అలాగే వారు పేపర్ సైజులవారీగా ఎంత రేటు కొనుగోలు చేస్తున్నారు అనే విషయంపై మనకు అవగాహన ఉండాలి అప్పుడే మనం తయారు చేసిన A4 పేపర్ బండిల్స్ ఎన్ని విక్రయించగలము అనేది మనకు స్పష్టమైన అవగాహన వస్తుంది.
అప్పుడు మనము ఈ వ్యాపారాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలం.
A4 పేపర్ బండిల్ ను ఎక్కువగా జిరాక్స్ సెంటర్ వారు కొనుగోలు చేస్తూ ఉంటారు అలాగే బుక్ స్టాల్ వారు కూడా A4 పేపర్ బండిల్స్ మన వద్ద నుండి హోల్సేల్గా కొనుగోలు చేసి రిటైల్గా విక్రయిస్తూ ఉంటారు.
అలాగే బ్యాంక్ సంబంధించిన వ్యక్తులు మన వద్ద నుండి A4 పేపర్ బండిల్స్ కొనుగోలు చేస్తారు.
అలాగే ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలలో A4 పేపర్ బండిల్స్ కొనుగోలు చేస్తారు.
మీరు వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే మనము తయారు చేసిన A4 పేపర్ బండిల్స్ ను ఎక్కడ అమ్మగలము అనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి అప్పుడే ఈ వ్యాపారం లో మనం అద్భుతంగా రాణించి గలుగుతాము.
---------------------------------------------------------------------------------------------------
మిషనరీ కి సంబంధించిన సమాచారం :-
White A4 Size Copier Paper Roll
70 Gsm 80 Gsm 90 Gsm A4 Size Paper In Reels
https://www.indiamart.com/proddetail/70-gsm-80-gsm-90-gsm-a4-size-paper-in-reels-22787173212.html
A4 sheet size copier paper making machine
-----------------------------------------------------------------------------------------------------
వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గానే పూర్తి సమాచారం తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి అలాగే కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఇవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members