Atukulu business in telugu

 అటుకుల తాలింపు వ్యాపారం :-

అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము. 

అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. 

ఈరోజు తక్కువ పెట్టుబడి తో ప్రతిరోజు ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. 

ఈ వ్యాపారానికి ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు.

ఈ వ్యాపారం పేరు అటుకులు తాలింపు వ్యాపారం అంటారు.

కొన్ని కొన్ని ఏరియాలలో ఇంకో పేరుతో పిలుస్తారు.

వ్యాపారాన్ని మీరు ఏ ఊరు నుండి నా ప్రారంభించవచ్చు.

ఉదయం అలాగే సాయంత్రం  ఈ వ్యాపారం చేసుకోవచ్చు.

ఈరోజు మార్నింగ్ టిఫిన్ చాలా చోట్ల దొరకని పరిస్థితి ఉంది అలాగే దొరికిన మంచి టిఫిన్ కోసం జనాలు వెతుకుతూనే ఉంటారు. 

ఎక్కడ మంచి టిఫిన్ దొరికితే అక్కడికే వెళ్లి తింటారు.

అటుకుల తాలింపు వ్యాపారం చాలా మంచి వ్యాపారం ఎందుకంటే కస్టమర్లకు మంచి ఫుడ్డు అందించినట్టు గా ఉంటుంది.  

అలాగే ఎటువంటి కొలెస్ట్రాల్ లేని మంచి ఆహారంగా భావించాలి.

ఇప్పుడిప్పుడే చాలా ఏరియాలలో అటుకుల తాలింపు వ్యాపారం బాగా జరుగుతుంది. 

ఒక కేజీ అటుకులు తీసుకుని బొరుగులు ఎలాగైతే నానబెట్టి తాళింపు వేస్తామో అలాగే అటుకులను కూడా నానబెట్టి తాలింపు వేసుకోవాలి. 

ఈరోజుల్లో వెరైటీ టిఫిన్ చేయడం వల్ల తొందరగా వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు. 

అలాగే ఒక్కసారి అటుకులు తాలింపు తిన్న కస్టమరు మళ్లీ మళ్లీ మన టిఫిన్ సెంటర్ కు వస్తారు అంత రుచిగా ఉంటుంది కనుక ఈ వ్యాపారం బాగా జరుగుతుంది. 

కొన్ని ఏరియాలలో అటుకుల తాలింపు ఉన్నది అనే విషయం కూడా చాలా మందికి తెలియదు కనుక మీరు మొదలుగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించినట్లైతే మంచి ఆదాయంతో పాటు స్థిరమైన వ్యాపారం కూడా మీకు దొరికినట్లుగా ఉంటుంది.

కనుక టిఫిన్ సెంటర్ పెట్టాలనుకునే వ్యక్తులు అలాగే ఏదైనా మంచి వ్యాపారం చేయాలనే వ్యక్తులు బొరుగుల తాలింపు వ్యాపారం లాగానే అటుకుల తాలింపు వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చు. 

ఏ రోజుకారోజు వ్యాపారానికి కావలసిన ముడి సరుకు కొనుక్కొని వ్యాపారం చేయవచ్చు అలాగే ప్రతిరోజు ఈ వ్యాపారం ద్వారా వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు. 

తెలుగు రాష్ట్రాలలో ఈ వ్యాపారాన్ని చాలా తక్కువ మంది ప్రారంబించి ఉన్నారు. 

మీరు తొందరగా అటుకులు తాలింపు వ్యాపారం గురించి తెలుసుకొని మీ ఊరి నుండి వ్యాపారాన్ని ప్రారంభించండి.

వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి.




కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.



***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close