మోటార్ బైక్ అలాగే కార్ సర్వీస్ వ్యాపారం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము.
వెబ్ సైట్ ద్వారా అడ్రస్ అదనపు సమాచారాన్ని తెలియజేస్తూ వస్తున్నాము.
ఈరోజులో మోటార్ బైక్ లేని వ్యక్తి లేడు ఎందుకంటే ప్రతి ఇంటికి ఒక మోటార్ బైక్ ఉంటుంది అలాగే ఒక ఇంట్లో ఒకటి కన్నా ఎక్కువ మోటార్ సైకిల్ కూడా ఉంటాయి.
చాలామందికి వారికి ఉండే పని ఒత్తిడి కారణంగా బైక్ సర్వీసును చేయించుకోవాలి అనుకుంటూనే పోస్ట్ ఫోన్ చేస్తూ ఉంటారు అలాంటి వారి దగ్గరికి వెళ్లి వారి బైక్ సర్వీస్ చేసి వారి వద్ద నుండి ఆదాయాన్ని సంపాదించవచ్చు.
వ్యాపారానికి చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది.
బైక్ సర్వీస్ సంబంధించిన ఒక టూల్ కిట్ కోనాల్సి ఉంటుంది అది అమెజాన్ లో దొరుకుతుంది అలాగే బైక్ సర్వీస్ చేసే వాటర్ పైపు బైక్ సంబంధించిన క్లీనింగ్ ఆయిల్ మనకు అవసరం అవుతాయి.
ఇవి అన్నీ అమెజాన్ లో దొరుకుతాయి మీరు అమెజాన్ లోకి వెళ్లి బైక్ సర్వీస్ ఉపయోగించే వస్తువులు అని టైప్ చేస్తే ఇవన్నీ దొరుకుతాయి.
కొత్తగా ఈ వ్యాపారం చేయాలనే వ్యక్తులు ఈ సామాన్లన్నీ కొనుగోలు చేయవలసి ఉంటుంది.
అలాగే మోటార్ బైక్ రిపేర్ తెలిసిన వ్యక్తులు కూడా ఈ వ్యాపారం చేయవచ్చు.
వాటర్ సర్వీస్ తో పాటుగా మోటార్ సైకిల్ కు ఉండే చిన్న చిన్న రిపేరు చేస్తూ అదనంగా ఆదాయం సంపాదించవచ్చు.
బైక్ మెకానిక్ తెలియని వ్యక్తులు వాటర్ సర్వీస్ చేస్తూ బండి కి సంబంధించిన పార్ట్స్ ఏవన్నా లూస్ గా ఉంటే వాటిని బిగిస్తూ వాటర్ సర్వీస్ చేస్తూ ప్రతిరోజు వెయ్యి రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించవచ్చు.
సర్వీస్ సెంటర్ లో 70 రూపాయలు వాటర్ సర్వీస్ చార్జి చేస్తున్నారు.
మీరు కస్టమర్ ఇంటి వద్దకు వెళ్లి వాటర్ సర్వీస్ చేస్తారు గనక మీరు 100 రూపాయలు వాటర్ సర్వీస్ తీసుకొనవచ్చును.
అలాగే వారి ఇంటి వద్దనే సర్వీస్ చేస్తారు కనుక వాటర్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది.
అలా కాకుండా మీరు వాటర్ సర్వీస్ సెంటర్ పెట్టుకున్నట్లైతే స్థలానికి అద్దె కట్టవలసి వస్తుంది అలాగే వాటర్కు బోర్ వెస్కోవాల్సి వస్తుంది.
ఇలా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది.
అలా ఖర్చు పెట్టగలిగే వ్యక్తులకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖర్చు పెట్టలేని వ్యక్తులు డోర్ టు డోర్ తిరుగుతూ ఈ వ్యాపారాన్ని అభివృద్ధి పంచుకోవచ్చు.
కస్టమర్ ఇంటి వద్దకు వెళ్లి మీరు వాటర్ సర్వీస్ చేస్తారు గనుక కస్టమర్లు ఎప్పుడు మీకె కాల్ చేస్తూ ఉంటారు.
ప్రతిరోజు 10 నుండి 20 బండ్ల వరకు సర్వీస్ చేయవచ్చు కనుక మనకు మంచి ఆదాయాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది.
ఈ వ్యాపారం పెట్టుబడి చాలా తక్కువగా ఉంటుంది కనుక పెట్టుబడి లేని వ్యక్తులు ఈ వ్యాపారం గురించి ఆలోచించవచ్చు.
అలాగే ఇద్దరు కలిసి కూడా ఈ వ్యాపారం చేసుకోవచ్చు.
ఈ వ్యాపారం చేయాలి అనే వ్యక్తికి కచ్చితంగా మోటార్ సైకిల్ ఉండాలి అప్పుడే అతను అన్ని ఏరియాల్లో తిరుగుతూ కస్టమర్ ఇంటి వద్దకే వెళ్లి సర్వీస్ చేయడం వీలవుతుంది.
అలాగే ఒకసారి వాటర్ సర్వీస్ చేసుకున్న వ్యక్తులు వారికి వాటర్ సర్వీస్ అవసరమైనప్పుడల్లా మీకె ఫోన్ చేస్తారు.
ప్రతి కస్టమర్లకు మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అలా ఫోన్ నెంబర్ ఇవ్వడం ద్వారా మీ వ్యాపారం డే బై డే ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది.
ఇంత తక్కువ పెట్టుబడితో ఇంత మంచి ఆదాయం వస్తున్న వ్యాపారాన్ని చేయాలనుకుంటున్నారా ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి.
---------------------------------------------------------------------------------------------------
BIKE AND CAR SERVICE TOOL KIT
Tire Puncture Kit :- https://amzn.to/3ylDpD1
Spanner set :- https://amzn.to/3C2kEqm
Car and Bike tyre air compresser :- https://amzn.to/2WJ7ApV
Vacuum Cleaner :- https://amzn.to/3yocJSk
Bike and Car washer :- https://amzn.to/37f8fBf
Car cleaning kit :- https://amzn.to/3rJPwqU
---------------------------------------------------------------------------------------------------
వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members