దోశ పిండి తయారుచేసి అమ్మే విధానం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్సైట్ను ప్రారంభించాను.
వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము.
ఈరోజు అతి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో చేసే వ్యాపారం గురించి తెలియజేస్తాను.
కేవలం 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే అద్భుతమైన వ్యాపారం దోశ పిండి తయారుచేసి విక్రయించడం.
ఈ వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా వారి ఇంటి నుండి ప్రారంభించవచ్చు.
ఈ వ్యాపారానికి ముఖ్యంగా కావలసింది గ్రైండర్ , బియ్యం అలాగే మినప గుండ్లు.
ఈ మూడు రకాలతో మనము మన ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
ప్రతి ఊరిలో ప్రతి బజార్లో ఒకటో రెండో కిరాణా షాపులు ఉంటాయి అలాంటి షాపులో మీరు ఉంటున్న ఊరి నందు ఎన్ని షాపులు ఉన్నాయి అనే విషయం ముందే తెలుసుకోవాలి ఎందుకంటే మనము దోశ పిండి ని తయారుచేసి అలాంటి కిరాణా షాపులకు హోల్సేల్గా విక్రయించాలి కాబట్టి.
ఈరోజుల్లో ఆహారాన్ని ప్రతి వ్యక్తి రెడీమేడ్గా కొనుగోలు చేస్తున్నాడు అలాంటి వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని మనము దోశ పిండి ని తయారుచేసి విక్రయించాలి.
ఈ వ్యాపారాన్ని రెండు విధాలుగా చేయవచ్చు.
మొదటి విధానంలో మనము తయారు చేసిన దోశ మన ఇంటి వద్ద నుండి అమ్మకాలు చేయవచ్చు.
అలాగే రెండో విధానం ఊరిలో ఉన్న అన్ని చిల్లర కోట్ల వ్యక్తులతో మాట్లాడి వారి ద్వారా మనము తయారీ చేసిన దోశ పిండి ని విక్రయించడం.
మీ ఊరిలో ఉండే ఎన్నో కిరాణా షాపులు కస్టమర్స్ కావాల్సిన చిల్లర సరుకులను అమ్ముతుంటారు వాటితో పాటుగా మనము తయారు చేసిన దోశ పిండి ని కూడా వారు విక్రయిస్తారు కనుక మనము ఈ వ్యాపారాన్ని ఈ విధంగా చేయవచ్చు.
మనకు ఈ వ్యాపారంలో ప్రతిరోజు రెండు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది.
ఒక కేజీ దోశ పిండి హోల్ సేల్ గా విక్రయించడం వల్ల మనకు ఖర్చులన్నీ పోను కేజీకి 5 రూపాయల ఆదాయం ఉంటుంది.
మనము ఎన్ని కేజీలు హోల్ సేల్ గా విక్రయించగలము అనే విధానాన్ని బట్టి మనకు ఆదాయం వస్తుంది.
అలాగే మనం తయారు చేసిన దోశ పిండి ని మన ఇంటి వద్ద రిటైల్గా విక్రయిస్తే ఒక కేజీకి 15 రూపాయల ఆదాయం ఉంటుంది.
కనుక మనము చేయు వ్యాపారాన్ని రెండు విధాలుగా చేయవచ్చు.
ఇలా ప్రతిరోజు హోల్ సేల్ గా కనీసం ఒక షాపుకు ఐదు కేజీలు విక్రయించినా మనము దాదాపుగా 250 కేజీల వరకు విక్రయించవచ్చు.
అలాగే మనము మరికొన్ని ఎక్కువ షాపుల వారితో మాట్లాడగలిగితే ఇంకా ఎక్కువ కేజీలను అమ్మడానికి అవకాశం ఉంటుంది.
ఈ విధంగా మనము ఈ వ్యాపారాన్ని ప్రతిరోజు అభివృద్ధి పథంలో పయనించే విధంగా వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు.
చాలామంది తక్కువ పెట్టుబడి తో చేయగలిగే వ్యాపారాల గురించి తెలుసుకోవాలి అనుకుంటారు అలాంటి వారందరూ ఈ వ్యాపారం గురించి ఆలోచించవచ్చు.
మనము పెట్టుబడిగా పెట్టె 20 వేల రూపాయలు గ్రైండర్ కొనడానికి , బియ్యం కొనడానికి అలాగే మినప గుళ్ళు కొనడానికి సరిపోతాయి కనుక ఎటువంటి అదనపు పెట్టుబడి అవసరం లేదు.
ఇంకా మీకు వ్యాపారం బాగా అభివృద్ధి లో ఉంటే పెట్టుబడి పెంచుకోకుండా ఏ రోజుకారోజు ముడి సరుకు కొనుగోలు చేయండి అప్పుడు 20 వేల రూపాయల పెట్టుబడితోనే ఎంత వ్యాపారమైనా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది.
కనుక వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గానే పూర్తి సమాచారం తెలుసుకోండి ఆ తర్వాత మీరు ఎప్పుడు వ్యాపారాన్ని ప్రారంభించిన ఎటువంటి ఇబ్బంది లేకుండా అద్భుతంగా జరుగుతుంది.
ఏ వ్యాపారమైనా ప్రారంభించేముందుగానే పూర్తి సమాచారం తెలుసుకోవాలి అప్పుడే ఆ వ్యాపారంలో మనము బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members