Eggs Business in Telugu

 20 వేల పెట్టుబడితో కోడి గుడ్ల వ్యాపారం చేసే విధానం :-

అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.
మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము. 

వెబ్ సైట్ ద్వారా అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము. 

ఈరోజు 20 వేల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో చేయగలిగే మరో వ్యాపారం గురించి తెలుసుకుందాం. 

చాలామందికి తక్కువ పెట్టుబడి తో చేసే వ్యాపారాలు తెలుసుకోవాలని ఉంది అలాగే అలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలని ఉంటుంది. 

అలా ఆలోచిస్తున్న అందరికోసం ఈరోజు 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే కోడి గుడ్ల వ్యాపారం గురించి తెలుసుకుందాం. 

ఈ వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా ఏ ఊరు నుండైనా ప్రారంభించవచ్చు. 

ఈ వ్యాపారంలో అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి అలాగే ఫుడ్ సంబంధించిన వ్యాపారం కనుక ప్రతిరోజు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. 

ఈ వ్యాపారాన్ని రిటైల్గా అలాగే హోల్ సేల్ గా చేయవచ్చు.

రిటైల్గా చేయాలనుకునేవారు కూరగాయల మార్కెట్ సెంటర్ నందు గాని లేదా చిల్లర కొట్టు ఉండే ఏరియా నందు గాని ఏదైనా ఒక షాపు ముందు ఒక టేబులు పెట్టుకునే విధంగా రెంటుకు స్థలాన్ని మాట్లాడుకోండి. 

బిజీ ఏరియా కాబట్టి మీ వ్యాపారం బాగా జరుగుతుంది.

ఈ వ్యాపారాన్ని మనం ప్రారంభించాలి అంటే ఖచ్చితంగా మంచి సెంట్రల్ ఉండాలి అలాగే రద్దీ ప్రదేశం అయిఉండాలి అప్పుడే ఈ వ్యాపారం బాగా జరుగుతుంది. 

షాపుల ముందు అద్దె లేకుండా కోడిగుడ్లు అమ్మాలి అనుకుంటే ఎవరు వారి షాపు ముందు మన వ్యాపారాన్ని ఒప్పుకోరు అలా కాకుండా ఎంతోకొంత అద్దె చెల్లిస్తూ వారి షాపు ముందు మనం వ్యాపారం చేసుకోవచ్చు కనుక ఎక్కడ వ్యాపారం జరుగుతుందో ఆ ప్రదేశాన్ని మనం ముందే పరిశీలనగా చెక్ చేసుకోవాలి ఆ తర్వాత అక్కడ ఉండే షాపు వారితో మాట్లాడమని మీరు వ్యాపారం ప్రారంభించవచ్చు. 

ఒక ట్రే కు 30 గుడ్లు ఉంటాయి ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం మనకు 30 గుడ్లు 125 రూపాయల నుండి 130 వరకు హోల్సేల్ మార్కెట్ లో దొరుకుతాయి. 

హోల్సేల్ వ్యాపారుల వద్ద నుండి మనం కొనుగోలు చేసి రిటైల్గా విక్రయించవచ్చు. 

130 రూపాయలకు కొనుగోలు చేసిన 30 గుడ్లను 150 రూపాయలకు విక్రయించవచ్చు. 

ఈ విధంగా 20 వేల రూపాయలకు మనకు 160 ట్రే లా కోడి గుడ్లు వస్తాయి. 

ఒక ట్రే కు 20 రూపాయల ఆదాయం ఉంటుంది.
ఒకరోజు 100 నుండి 160 ట్రే ల వరకు మనము విక్రయించవచ్చు. 

ఈ విధంగా మనకు రిటైల్ మార్కెట్లో ప్రతిరోజు 2000 రూపాయల నుండి 3,200 వరకు ఆదాయం వస్తుంది. 

అలాగే హోల్ సేల్ గా కూడా కోడిగుడ్లను విక్రయించవచ్చు.

మీ ఊరిలో ప్రతి రెండు బజార్లకు ఒక చిల్లర కొట్టు ఉంటుంది.

చిల్లర కొట్టు వారితో మాట్లాడి కొంచెం ఆదాయం తక్కువగా వేసుకొని హోల్ సేల్ గా కూడా మీరు కోడిగుడ్లను విక్రయించవచ్చు. 

ప్రతి ఊరు నందు ఎన్నో చిలరకోట్లు ఉంటాయి వారందరితో మాట్లాడుకొని మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు.

అలాగే ఎన్నో రెస్టారెంట్లు ఉంటాయి వారికి కూడా ప్రతిరోజు కోడిగుడ్లు అవసరం ఉంటుంది అలాగే నూడిల్స్ బండి వాళ్లతోటి మాట్లాడకండి వారికి కూడా ప్రతిరోజు కోడిగుడ్లు అవసరం ఉంటుంది. 

ఇలా ఎవరికైతే ప్రతిరోజు కోడిగుడ్లు అవసరమో వారి అందరితోనూ మీరు మాట్లాడుకుని అనుకూలమైన రేట్లకు కోడిగుడ్డు విక్రయిస్తూ అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు.




వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి.




కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.



***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close