20 వేల పెట్టుబడితో చిల్లర కొట్టు ప్రారంభించడం ఎలా :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము.
ఈరోజు 20 వేల రూపాయల పెట్టుబడితో చిల్లర కొట్టు ని ఎలా ప్రారంభించాలి అనే విషయాన్ని అలాగే మనకు ఎంత ఆదాయం వస్తుంది అనే విషయాన్ని అలాగే చిల్లర కొట్టుకు అవసరమైన సరుకులు కొనే విధానాన్ని మరియు అమ్మే విధానం మొత్తంగా తెలుసుకుందాం.
చాలామంది ఇంటి వద్దనే ఉంటూ ప్రతి రోజూ ఎంతో కొంత ఆదాయం వచ్చే వ్యాపారం గురించి తెలియజేయమని అడుగుతున్నారు వారందర్నీ దృష్టిలో పెట్టుకొని తక్కువ పెట్టుబడి తో చేయగలిగే చిల్లర కొట్టు వ్యాపారం గురించి తెలియజేస్తాను.
ఈ వ్యాపారాన్ని ఎవరైనా గాని వారి ఇంటి నుండి ప్రారంభించవచ్చు.
ఈ వ్యాపారానికి పెట్టుబడి చాలా తక్కువ కనుక ఎవరైనా చేసుకొనవచ్చును.
మనము చిల్లర కొట్టు వ్యాపారాన్ని మన ఇంటి నుండి ప్రారంభిస్తున్నాము కనుక మనకు ఉండే కస్టమర్లు మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు.
వారే మన వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తారు కనుక చిల్లర కొట్టు వ్యాపారానికి మనకు వేరే చోట నుండి కస్టమర్లు రారు అది దృష్టిలో పెట్టుకొని మనం వ్యాపారాన్ని చేయాలి.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే వ్యక్తి ఎదుటి వ్యక్తి తోటి బాగా మాట్లాడగలిగితే సరిపోతుంది.
ఈ వ్యాపారానికి అంతకన్నా క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎందుకంటే మన చుట్టుపక్కల వారి తోటి మనము బాగా మాట్లాడగలిగితే వారికి అవసరమైన సరుకులను మన కొట్టు వద్ద నుండి కొనుగోలు చేస్తారు కనుక ఈ వ్యాపారం ప్రారంభించిన వ్యక్తికి ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి తో బాగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి అప్పుడే ఈ వ్యాపారం మనము బాగా రాణించగలుగుతారు.
మొదటిగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందే మీ ఊరిలో ఎన్ని హోల్సేల్ కిరాణా షాపులు ఉన్నాయి అనే విషయం మీకు పూర్తిగా అవగాహన ఉండాలి అప్పుడే మనము కొనుగోలు చేసే సరుకులు తక్కువ రేట్ కి ఇచ్చే షాప్ కి వెళ్లి కొనుగోలు చేయవచ్చు అలాగే చిల్లర కొట్టు కు కావలసిన అన్ని రకాల సరుకులను హోల్ సేల్ గా కొనుగోలు చేయడానికి ప్రయత్నించండి.
అలా కొనుగోలు చేయడం వల్లే మనకు ఒక రూపాయి ఆదాయం ఉంటుంది.
చిల్లర కొట్టు సరుకులు కొనుగోలు చేసేటప్పుడు తక్కువ తక్కువ గా కొనుగోలు చేయండి ఎందుకంటే ఎక్కువగా కొనుగోలు చేస్తే మనం కొనుగోలు చేసిన సరుపు పాడవుతుంది కనుక ఏ రోజుకారోజు సరుకు కొనుగోలు చేస్తూ మీ వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోండి.
అలాగే చిల్లర కొట్టు కు ఎన్ని రకాలు సరుకులు కావాలో హోల్ సేల్ షాపులో ముందుగానే తెలుసుకోండి అప్పుడు నీకు సరుకు కొనుగోలు చేయను ఈజీగా ఉంటుంది.
అలాగే చిల్లర కొట్టు తోపాటు కూరగాయలు కూడా మీరు మీ షాపు నందు విక్రయించవచ్చు.
ప్రతిరోజు హోల్సేల్ కూరగాయల మార్కెట్ కి వెళ్లి అక్కడ నుండి కొనుగోలు చేయండి.
మీరు రీజనబుల్ గా సరుకులు అలాగే కూరగాయలు కొనుగోలు చేస్తారు గనుక కస్టమర్ కూడా రీజనబుల్ రేట్లకు విక్రయించింది అప్పుడే కస్టమర్ మీ షాపు వద్దకు వచ్చి సరుకు కొనుగోలు చేస్తాడు.
అలా కాకుండా ఎక్కువ రేట్లకు విక్రయిస్తు ఉంటే కస్టమర్ వేరే షాప్ కి వెళ్లి కొనుగోలు చేస్తాడు కనుక చాలా రీజనబుల్ రేట్లకు మనము విక్రయించాల్సి ఉంటుంది.
ఎందుకంటే మన వ్యాపారానికి ఎక్కడి నుండో కొత్త కష్టమర్స్ ఉన్నారు ఎందుకంటే మనం ఇంట్లో వ్యాపారం చేస్తున్నాము కనక మనకు మన చుట్టుపక్కల వాళ్లే కస్టమర్లు అది దృష్టిలో పెట్టుకొని తక్కువ ఆదాయానికి సరుకులు విక్రయించడం అలవాటు చేసుకోండి అప్పుడే కస్టమర్ మీ షాప్ లో వారికి కావలసిన సరుకులు కొనుగోలు చేస్తాడు.
ఈ విధంగా మీరు వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రతి నెల మంచి ఆదాయాన్ని సంపాదించగలరు.
వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గానే ఆ వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members