Start fruits business

 20 వేల రూపాయల పెట్టుబడితో పండ్ల వ్యాపారం చేయు విధానం :-

అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము. 

వ్యాపారానికి సంబంధించిన అడ్రస్లను అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తూ వస్తున్నాము. 

ఈరోజు 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే వ్యాపారం గురించి తెలుసుకుందాం. 

అన్ని రకాల పండ్లు విక్రయించే వ్యాపారం. 

మీరు ఈ వ్యాపారాన్ని ఏ ఊరు నైనా ప్రారంభించవచ్చు ఎందుకంటే ఈ వ్యాపారం లో మనము పండ్లు కొనుగోలు చేసేటప్పుడు మెలుకువతో కొనుగోలు చేయాలి అమ్మకాల విషయానికొస్తే ఎక్కడినుంచైనా ఏ ప్రాంతం నుంచైనా పండ్లను విక్రయించవచ్చు. 

ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యక్తి ఆరోగ్యం మీద శ్రద్ధ పెడుతున్నాడు పండ్లను కొనుగోలు చేసి కుటుంబ సభ్యులతో కలసి ఆహారంగా స్వీకరిస్తున్నారు కనుక ఈ వ్యాపారం ప్రతిరోజు అభివృద్ధి చెందుతూ ఉంది.

వ్యాపారం చేయు విధానం :-
ఫ్రెండ్స్ 20 వేల రూపాయల పెట్టుబడితో అన్ని రకాల పండ్లు కొనుగోలు చేసి విక్రయిస్తూ ప్రతిరోజు మూడు వేల రూపాయల నుండి పది వేల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదించవచ్చు కనుక ఈ వ్యాపారం ఎలా చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 

ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగానే మీకు దగ్గరలో ఎక్కడ పండ్లు హోల్సేల్ గా విక్రయించే మార్కెట్లు ఉన్నాయో తెలుసుకోండి ఎందుకంటే మనము అక్కడ నుండి పండ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 

ఆ తరువాత ఆ మార్కెట్ కి వెళ్లి ఏ సీజన్ లో ఎన్ని రకాల పండ్లు దోరుగుతున్నాయో పరిశీలించండి. 

అలా పరిశీలించడం ద్వారా ఏ సీజన్లో ఏ పండ్లు విక్రయించగలమో అనే విషయంపై మనకు పూర్తి అవగాహన వస్తుంది. 

అలాగే మార్కెట్లో ఎన్ని షాపులు పండ్లను హోల్ సేల్ గా విక్రయిస్తున్నాయి అని పరిశీలించండి ఆ తరువాత ఏ పండ్లు ఎంత రేటు కు విక్రయిస్తున్నారు అనే విషయంపై పూర్తి అవగాహన పెంచుకోండి అప్పుడు ఏమవుతుందంటే మీరు ఫ్రూట్స్ కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా కొనుగోలు చేస్తారు.

ఎక్కడ రేటు తక్కువగా వస్తుందో అక్కడ నుండి మాత్రమే కొనుగోలు చేస్తారు అలా కాకుండా మీరు మార్కెట్ వెళ్లకుండా హోల్ సేల్ షాప్ లో వివరాలు తెలుసుకోకుండా ఉంటే మనము పండ్లు కొనేటప్పుడు ఏదో షాపులో కొనుగోలు చేయడంవల్ల అక్కడ మనకు కొనుగోలు చేసే రేటు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది కనుక ఒకటికి రెండు సార్లు ఎవరు రేటు అనుకూలంగా ఇస్తున్నారు అనే విషయం మనకు అవగాహన ఉండాలి. 

మీకు హోల్సేల్ మార్కెట్ కు దగ్గరగా ఉంటే ఏ రోజు పండ్లు ఆరోజే కొనుగోలు చేయడం అలవాటు చేసుకోండి. 

అప్పుడే 20 వేల రూపాయలకే ఆ సీజన్ లో దొరికే అన్ని రకాల పండ్లు మనము కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. 

అలా కాకుండా పండ్ల మార్కెట్ దూరంగా ఉన్నట్లయితే మీరు అమ్మే సరుకు ని బట్టి ఆ రోజు జరిగే వ్యాపారాన్ని బట్టి సరుకు కొనుగోలు చేయండి. 

ఆ తరువాత మీరు పండ్ల వ్యాపారాన్ని ఏ ఏరియా నుండైనా ప్రారంభించవచ్చు. 

పండ్ల వ్యాపారం చేసేటప్పుడు మీరు ఉంటున్న ఊరికి ఎంట్రన్స్ లో రోడ్డుకు సైడ్ గా పండ్ల షాపు ఏర్పాటు చేసుకొని పండ్లు విక్రయించండి. 

అక్కడ షాప్ ఏర్పాటు చేసుకోవడం వల్ల రెంటు కట్టవలసిన అవసరం ఉండదు అలాగే రోడ్డుమీద తిరుగుతున్న వ్యక్తులందరూ మీ షాపు చూస్తూ ఉంటారు వారికి పండ్లు అవసరమైనప్పుడు మీ షాపు వద్ద వారి వాహనాన్ని ఆపి కొనుగోలు చేస్తూ ఉంటారు. 

ఈ విధంగా ప్రతి వ్యక్తి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు అలాగే ఎవరు ఈ వ్యాపారం చేస్తున్న  అద్దె ఉండదు కాబట్టి ఆదాయం మరికొంత ఎక్కువగా మిగులుతుంది కనుక ఈ వ్యాపారంలో కేవలం సరుకు కొనుగోలు చేసేటప్పుడు మనము తెలివిగా రీజనబుల్ రేట్లకు విక్రయిస్తున్న వ్యక్తి వద్దనుండి మాత్రమే పండ్లు కొనుగోలు చేయాలి అప్పుడే మనము ఈ వ్యాపారంలో బాగా రాణించగలుగుతారు.




వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి.




కొత్త కొత్త సమాచారం కోసం ఈ వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.


***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close