Start vegetable business with rs 20000

 20 వేల పెట్టుబడితో చేయగలిగే కూరగాయల వ్యాపారం :-

అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము. 

వ్యాపారాలు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాము.

వ్యాపారం :-
ఈరోజు 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే అద్భుతమైన వ్యాపారం కూరగాయల వ్యాపారం. 

ఈ వ్యాపారాన్ని ఎవరైనా గాని ఏ ఊరు  నుండి అయినా ప్రారంభించవచ్చు. 

అతి తక్కువ పెట్టుబడి తో ఎక్కువ ఆదాయం వస్తుంది అలాగే ఈ వ్యాపారం చేయాలనుకునే వ్యక్తులు ఖచ్చితంగా ఖచ్చితమైన విధానాన్ని పాటిస్తే అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి. 

ప్రతిరోజు మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.

వ్యాపారం చేసే విధానం :-
వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకున్నప్పుడే మనం వ్యాపారంలో రాణించగలుగుతాము. 

కూరగాయల వ్యాపారం ప్రారంభించే ముందుగానే మీ ఊరికి దగ్గరలోని కూరగాయల హోల్సేల్ మార్కెట్ గురించి తెలుసుకోవాలి అలాగే మార్కెట్లో ఎన్ని కోట్లు కూరగాయలను హోల్సేల్గా విక్రయిస్తున్నాయి అనే విషయంపై మీకు పూర్తి అవగాహన ఉండాలి అప్పుడే మనము రీజనల్ ధరలకు కూరగాయలను కొనుగోలు చేస్తాము. 

తరువాత మీరు ఏ ఊర్లో వ్యాపారం ప్రారంభించాలని అనుకుంటున్నారో ఆ ఊర్లో 4 లేదా 5 ఏరియాలను పరిశీలించండి అక్కడ ఈ వ్యాపారం జరుగుతుందో లేదో మీకు ఒక అవగాహన వస్తుంది అప్పుడు అక్కడ మనం వ్యాపారం ప్రారంభించవచ్చు. 

కూరగాయల వ్యాపారం బాగా జరగాలంటే ఎక్కువగా జనాలు నిలబడే చోటు ఈ వ్యాపారాన్ని ఎంచుకోండి. 

అప్పుడు మనం కూరగాయలు విక్రయిస్తున్నట్లు గా అందరికీ అర్థమవుతుంది అప్పుడు కూరగాయల అవసరమైన వ్యక్తులు మన వద్దకు వచ్చి కొనుగోలు చేస్తారు. 

అలాగే కూరగాయల వ్యాపారం లో మెలుకువలు నేర్చుకోవాలి. 

బజార్లో కూరగాయలు అమ్మే వారి కంటే మీరు తక్కువ ధరకు ఇవ్వగలిగిఉండాలి. 

తక్కువ ఆదాయం వచ్చినా పర్వాలేదు అనుకునే ఈ వ్యాపారం చేయండి అప్పుడు కస్టమర్ ఏ కూరగాయలు అవసరమైన మీ షాపు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తాడు. 

అలా కాకుండా మీరు ఎక్కువ రేట్లకు కూరగాయలు విక్రయిస్తే కస్టమరు మన దగ్గర కూరగాయలు కొనడం మానేస్తాడు అందుకని లాభాన్ని తక్కువగా వేసుకొని కూరగాయల విక్రయించింది. 

అలా తక్కువగా లాభం తీసుకుంటే మీరు ప్రతిరోజు మూడు వేల రూపాయల నుండి  ఐదు వేల రూపాయల వరకు సంపాదిస్తారు. 

ఎవరైనా ఈ వ్యాపారాన్ని చేయాలనుకొనే వ్యక్తులు ఖచ్చితంగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

మీరు హోల్సేల్ గా కూరగాయలు కొనుగోలుకు పోయేటప్పుడు తెలివిగా నాణ్యతతో కూడిన కూరగాయలు కొనుగోలు చేయండి అలాగే  ఏ కూరగాయలు మనము ఎన్ని విక్రయించగలము అనే విషయంపై మనకు అవగాహన ఉంటే అన్ని కూరగాయలనే కొనుగోలు చేస్తాము. 

ఎందుకంటే ఏ రోజుకారోజు హోల్సేల్ మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొనుగోలు చేయడం వల్ల కూరగాయలు తాజాగా ఉంటాయి అప్పుడే కస్టమర్ మానదగ్గరికి వచ్చి కూరగాయలు కొనుగోలు చేస్తాడు. 

కూరగాయలు తాజాగా ఉండాలంటే ఏ రోజుకారోజు కొనుగోలు చేయడం తప్పితే రెండో మార్గం లేదు కనుక మన పెట్టుబడిని బట్టి కూరగాయలు కొనుగోలు చేయాలి.

వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గానే వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి.




కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.

***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close