Caps and Glasses Business

 టోపీలు & కళ్ళద్దాల వ్యాపారం :-

అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్సైట్ను ప్రారంభించాను. 

వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 

ఈరోజు ప్రతి వ్యక్తికి ఆదాయం అవసరం ఆదాయం లేని వ్యక్తులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయం మనలో ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. 

కనుక ప్రతి వ్యక్తికి మంచి వ్యాపారం కావాలి మంచి ఆదాయం రావాలి అప్పుడే జీవన విధానం సాఫీగా సాగిపోతుంది. 

ఫ్రెండ్స్ ఈరోజు టోపీలు అలాగే కళ్ళద్దాలు రిటైల్ వ్యాపారం ఎలా చేయాలి అని తెలుసుకుందాం. 

ఈ వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా ప్రారంభించవచ్చు. 

20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే వ్యాపారాల్లో అద్భుతమైన వ్యాపారం అని చెప్పాలి. 

ఎందుకంటే ఈ వ్యాపారానికి ఎటువంటి షాపులు అవసరం లేదు అలాగే ఎటువంటి బాడుగ చెల్లించనవసరం లేదు కనుక ఈ వ్యాపారాన్ని ఖర్చులేని వ్యాపారంగా తెలియజేస్తున్నాను.

మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు సరుకు కొనుగోలు విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. 

ఎందుకంటే మనం ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేస్తే మన ఆదాయం తగ్గిపోతుంది కనుక టోపీ అలాగే కళ్లద్దాలు హోల్ సేల్ గా కొనేటప్పుడు ఒకటికి పది సార్లు తిరిగి 10 షాపుల్లో ఎంక్వయిరీ చేసి ఎక్కడ రీజనబుల్ ధరలకు వస్తే అక్కడ నుండి కొనుగోలు చేయాలి. 

తెలంగాణలో హైదరాబాదులోని బేగం బజార్ ఏరియా లో టోపీలు మరియు కళ్ళద్దాలు హోల్సేల్గా విక్రయించే ఎన్నో షాపులు ఉన్నాయి. 

అలాగే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నందు వన్ టౌన్ ఏరియా లో టోపీలు కళ్ళద్దాలు విక్రయించే హోల్ సేల్ షాప్ లు ఉన్నాయి. 

మీకు ఏ ఏరియా దగ్గరైతే ఆ ఏరియా నుండి కొనుగోలు చేయవచ్చు. 

కొనుగోలు చేసి మీరు ఉంటున్న ఊరి బయట వాహనదారులకు అందరికీ కనబడే విధంగా టోపీలను కళ్లద్దాలను మార్చుకోండి వచ్చిపోయే మోటార్ సైకిల్ వ్యక్తులు టోపీలు కళ్లద్దాలు మీ వద్ద నుండి కొనుగోలు చేస్తారు.

ఇలా మీరు వ్యాపారం చేయడం వల్ల ఎటువంటి అదే లేకుండా ప్రతిరోజు మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు.

ఫ్రెండ్స్ ఏ వ్యాపారం గురించైనా పూర్తిగా తెలుసుకున్నప్పుడే ఆ వ్యాపారంలో మనకు విజయం వస్తుంది. 

అలా కాకుండా తెలిసీ తెలియని పరిజ్ఞానంతో వ్యాపారం చేస్తే నష్టపోతాము కనుక వ్యాపారం ప్రారంభించే ముందు గానే పూర్తి సమాచారం తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి.




వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి.

కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.


***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close