20 వేల రూపాయలు పెట్టుబడి తో కూరల వ్యాపారం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని తెలియజేస్తున్నాము.
ఈరోజు 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే కర్రీ పాయింట్ వ్యాపారం తెలుసుకుందాం.
తక్కువ పెట్టుబడి తో చేయగలిగే ఎన్నో రకాల వ్యాపారాలను తెలియజేస్తూ వస్తున్నాను అలాగే ఈరోజు ఇంకొక వ్యాపారం గురించి తెలియజేయుచున్నాను.
ఈ వ్యాపారానికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే ఈరోజుల్లో అందరూ రెడీమేడ్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారు అలాగే కర్రీస్ ను షాపుల వద్ద నుండి కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు.
పని ఒత్తిడి వల్ల చాలామంది ఉద్యోగస్తులు అలాగే వేరే ఊరి నుంచి వచ్చి చదువుకున్న విద్యార్థులు కూర తయారు చేసుకోవడం కష్టంగా ఉండటం వల్ల వారు ఎక్కువగా కర్రీ పాయింట్ నుండి కొనుగోలు చేస్తూ ఉంటారు కనుక ఈ వ్యాపారానికి ఎప్పటికీ ఇబ్బంది ఉండదు.
రుచికరంగా కూరలు తయారు చేసినంత వరకూ ఈ వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఈ వ్యాపారాన్ని చేయాలి అనుకునే వ్యక్తులు ఎక్కడైతే ఈ వ్యాపారం బాగా జరుగుతుందో ఆ ఏరియా ను సెలెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడంటే అక్కడ కర్రీ పాయింట్ వ్యాపారం జరగకపోవచ్చు కనుక మనము ప్రారంభించే ముందే ఏ ఏరియాలో వ్యాపారం బాగుంటుందో తెలుసుకోవాలి.
ఆ ఏరియాలో ఏదైనా ఒక ప్రదేశం లేదా రూమ్ అద్దెకు తీసుకోవాల్సి ఉంటుంది అలా దొరక్కపోతే ఏదైనా షాప్ ముందు ఈ వ్యాపారం స్టార్ట్ చేయవలసి ఉంటుంది.
మనము నెలకు కొంత అద్దె చెల్లిస్తామని తెలియజేయడం ద్వారా ఎవరో ఒకరు వారి షాపు ముందు ఈ వ్యాపారం చేసుకొనుటకు పర్మిషన్ ఇస్తారు.
అలా మన వ్యాపారాన్ని మంచి సెంటర్ నుండి ప్రారంభించవచ్చు.
ఈ వ్యాపారానికి చాలామందికి ఎదురయ్యే ప్రధాన సమస్య కర్రీ తయారు చేయడం.
ఈరోజుల్లో ఆ సమస్య పెద్ద సమస్య కాదు ఎందుకంటే ప్రతి ఇంట్లో కూరలు చేసే అలవాటు ఉండనే ఉంటుంది.
అలాగే కొత్త కర్రీస్ కోసం యూట్యూబ్ ద్వారా కొంత సమాచారం తెలుసుకోవచ్చు.
ఆ విధంగా రకరకాల కూరలు తయారు చేయవచ్చు.
ఇలాగే కాకుండా మన ఊరి నుండి మూడు లేదా నాలుగు సెంటర్లలో కర్రీ పాయింట్ స్టాల్స్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉంటే కర్రీకి ఒక వంట మాస్టర్ ని నియమించుకోండి.
ఎక్కువ కూరలు చేయాల్సి వస్తుంది కనుక వంట మాస్టర్ అవసరమవుతారు వారి ద్వారా మనం ఎక్కడైతే స్టాల్స్ను ఏర్పాటు చేస్తాము కనుక అందుకు సరిపోయిన కర్రీస్ తయారు చేసుకోవచ్చు.
అలాగే ఈ వ్యాపారానికి కర్రీస్ అమ్మే డిస్ప్లే కొనుగోలు చేయవలసి వస్తుంది.
మనము ఈ డిస్ప్లే లను అన్ని జిల్లా హెడ్ కోటర్ లో కొనుగోలు చేయవచ్చు.
ఎందుకంటే కర్రీ పాయింట్ కు సంబంధించిన వ్యాపారము ఎంతో అభివృద్ధి చెందుతుంది.
చాలా ఊర్లల్లో కర్రీ పాయింట్ డిస్ప్లే విక్రయిస్తున్నారు వారి వద్ద నుండి మనకు అవసరమైన సైజులో కొనుగోలు చేయవచ్చు.
ఈ విదానంగా రీజనబుల్ ఆదాయానికి రన్ చేయండి.
మీరు ఎక్కడ స్టాల్ ఏర్పాటు చేసిన అక్కడికి వచ్చే కస్టమర్లు కొనుగోలు చేస్తారు కనుక ఇలాంటి వ్యాపారంలో అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి.
మనము ఒక కర్రీని 200 రూపాయలకు తయారుచేస్తే మార్కెట్లో 600 విక్రయిస్తున్నారు.
అలా కాకుండా 200 రూపాయల కర్రీని 400 రూపాయల వరకు అమ్మండి.
ఇలా చేయడం వల్ల కస్టమర్లకు ఎంతో అనుకూలంగా మనము కూరలను విక్రయించినట్లు అవుతుంది.
కస్టమర్లకు అతని డబ్బులకు ఎక్కువగా కూర వచ్చినట్లుగా అనిపిస్తుంది అలాంటప్పుడు కస్టమర్ వేరే ఎక్కడ కర్రీస్ కొనుగోలు చేయరు కనుక మీరు ఎక్కడ వ్యాపారాన్ని ప్రారంభించిన అద్భుతంగా జరుగుతుంది.
వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members