Food motorcycle business

 20 వేల రూపాయల పెట్టుబడితో ఎన్నో రకాల టిఫిన్స్ తయారు చేసి విక్రయించడం ఎలా :-

అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాము మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో వెబ్సైట్ను ప్రారంభించాను. 

వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాను. 

ఈరోజు 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే అద్భుతమైన వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. 

ఈ వ్యాపారాన్ని ఎలాంటి వ్యక్తి అయినా ఏ ఊరు నుంచి అయినా ప్రారంభించవచ్చు. 

ఈ వ్యాపారాన్ని మీరు చేయగలరు అనిపిస్తే నిరభ్యంతరంగా ప్రారంభించవచ్చు. 

ఈరోజు మార్కెట్లో టిఫిన్ సెంటర్ కు ఉన్న విలువ మనకు తెలిసేఉంటుంది. 

అలాంటి టిఫిన్ సెంటర్ పెట్టాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక ఎలాంటి ఖర్చు లేకుండా అలాగే ఎలాంటి అద్దె చెల్లించకుండా టిఫిన్ సెంటర్ వ్యాపారాన్ని మనం చేయవచ్చు.

ఈ వ్యాపారం నుంచి నేను తెలియ చేయడానికి ప్రధాన కారణం ఒక వ్యక్తి ఈ వ్యాపారం చేయడం. 

ఆయన ఈ వ్యాపారం గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. 

అతను తెలిపిన విషయాలను నేను మీ అందరికీ వివరంగా చెప్పాలనుకుంటున్నాను. 

నేను చెప్పబోయే వ్యాపారం గురించి మనం వివరంగా తెలుసుకున్నప్పుడే ఈ వ్యాపారం చేయాలో లేదో మనం ఒక అవగాహనకు రావచ్చు. 

ఈ వ్యాపారం చేస్తున్న వ్యక్తి హైదరాబాదులో ఏం చేయాలో అర్థం కాక చాలాకాలం ఖాళీగా తిరుగుతూ ఉన్నాడు అలాగే ఇతను ఇంజనీరింగు చదివాడు ఎన్నో చోట్ల జాబు ప్రయత్నాలు చేస్తూ కొన్నిచోట్ల ఉద్యోగంలో చేరి అక్కడ వారితో ఉండలేక ఉద్యోగాన్ని వదిలేసి కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ దాదాపుగా ఆరు నెలల పాటు ఖాళీగా ఉంటూ ఏమి చేయాలి అని ఆలోచిస్తూనే ఉండేవాడు. 

ఒకరోజు అతనికి అద్భుతమైన ఐడియా వచ్చింది హైదరాబాదులో ఎన్నో ఏరియాలలో చాలా మంది వ్యక్తులు తక్కువ రేటుకు ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని ప్రయత్నిస్తూ ఉంటారు. 

అలాంటివారికి తక్కువ రేట్ కి ఆహారాన్ని అందించాలని నిర్ణయానికి వచ్చాడు. 

ఎలా అందించాలి పెట్టుబడి లేదు కానీ బలమైన కోరిక ఉంది.

ఈ విషయాన్ని హాస్టల్లో ఉంటున్న తన ఫ్రెండ్ తో చెప్పాడు అతనికి ఇతను చెప్పిన విధానం చాలా నచ్చడంతో ఇద్దరూ కలిసి వ్యాపారం స్టార్ట్ చేశారు. 

మొదటగా విరు 15 వేల రూపాయల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించారు. 

వీరికి వంటకు కావలసిన సామాన్లు కొనుగోలు చేశారు. 

ఆ తర్వాత మూడువేల రూపాయలు అడ్వాన్సుగా చెల్లించి ఒక ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ఎక్సెల్ బండిని కొన్నారు ఆ తరువాత వారికి అవగాహన మేరకు ఇరవై రోజుల పాటు వారి ఇంట్లో వంటలు తయారు చేస్తూ మేము చేయగలము అనే నమ్మకం వచ్చేవరకూ ఇంట్లోనే ఎన్నో రకాల వంటలు కొద్దికొద్దిగా తయారు చేస్తూ అనుభవం సంపాదించారు. 

ఆ తర్వాత వారికి బాగా తయారు చేయడం వచ్చినక ఆరు రకాల టిఫిన్స్ తయారుచేసి వారికి దగ్గరలోని ఒక సిటీ బస్ స్టాప్ సెంటర్ కి వెళ్లారు. 

వారు తయారుచేసిన ఆరు రకాల టిఫిన్స్ అక్కడికి చేర్చుకొని ఏ టిఫిన్ అయిందా 20 రూపాయలు రేటుకు విక్రయించడం ప్రారంభించారు. 

ఆరోజు వీరు తయారు చేసిన టిఫిన్ సగం మాత్రమే ఖర్చు అయ్యాయి కానీ పెట్టిన పెట్టుబడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి కొంత ఆదాయం మిగిలింది. 

ఆరోజు నుండి కొత్త కొత్త రకాల టిఫిన్స్ తయారు చేస్తూ విక్రయించడం ప్రారంభించారు. 

ప్రస్తుతం హైదరాబాదులో వారు 64 ఏరియాలలో టిఫిన్ విక్రయిస్తున్నారు. 

ఎంతగా వ్యాపారం అభివృద్ధి చెందిందో ఒకసారి ఆలోచించండి. 

ఇలాంటి వ్యాపారాన్ని ప్రతి వ్యక్తి అందిపుచ్చుకోవచ్చు.

చాలామంది మాకు టిఫిన్ చేయడం రాదు అంటుంటారు.

ఈరోజుల్లో కొత్త కొత్త రకాల టిఫిన్స్ చేయడం యూట్యూబ్ ద్వారా మనం చూస్తూఉంటాము. 

ఎన్నో రకాల వంటల పుస్తకాలు మనకు అందుబాటులో ఉన్నాయి మీరు ఏది అనుకూలంగా ఉంటే ఆ విధానంలో ప్రయత్నం చేయండి. 

ప్రతి ఒక్కరూ ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కనుక నేను చేయగలను అనే వ్యక్తి ఈ వ్యాపారాన్ని చేస్తూ అద్భుతమైన ఆదాయాలు సంపాదించవచ్చు.



వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి.



కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.



***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close