Household items business

 20 వేల రూపాయల పెట్టుబడితో ప్లాస్టిక్ వస్తువుల వ్యాపారం :-

అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వెబ్సైట్ను ప్రారంభించాను. 

వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము. 

ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి మంచి వ్యాపారం చేయాలి అని ఉంటుంది కానీ వ్యాపారం గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏ వ్యాపారాన్ని అయినా కరెక్ట్ గా చేయలేకపోతున్నారు. 

అలా కాకుండా సరైన అవగాహన తోటి మనము వ్యాపారాన్ని ప్రారంభించగలిగితే అద్భుతమైన సంపాదన సంపాదించవచ్చు. 

ఫ్రెండ్స్ ఈరోజు కేవలం 20 వేల రూపాయలతో చేయగలిగే అద్భుతమైన ప్లాస్టిక్ వ్యాపారం గురించి తెలుసుకుందాం.

ఈ వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా ఏ ఊరు నుండి అయినా ప్రారంభించవచ్చు. 

ఈ వ్యాపారానికి ముఖ్యంగా కావలసింది అవసరానికి వినియోగించే వస్తువుల మీద అవగాహన. 

మనము ఈ వ్యాపారంలో ప్రతి ఇంటికి అవసరమైన ఎన్నో రకాల వస్తువులను విక్రయించాల్సి ఉంటుంది. 

మామూలుగా అయితే ప్రతి వస్తువుకు ఒక రేటు ఉంటుంది అలా కాకుండా ఈ వ్యాపారం వేరే విధంగా చేయవలసి ఉంటుంది. 

మీరు అమ్ముకోబోయే వస్తువులు రెండు విభాగాలుగా విభజించి అమ్మవలెను. 

ఎలాగంటే మనకు మార్కెట్లో ఏ వస్తువైనా ₹10 , ఏ వస్తువైనా 20 రూపాయలు అంటూ విక్రయించే వాళ్ళని చూస్తూ ఉంటాము. 

వారంతా పదిరూపాయల రేటు అమ్మే వస్తువులను ఐదు రూపాయలు , ఆరు రూపాయలు , ఏడు రూపాయలు ఇలా మూడు ధరలలో కొనుగోలు చేస్తారు. 

అప్పుడు వారికి  పది రూపాయలకు అమ్మే వస్తువులు ఆరు రూపాయలు మాత్రమే పడుతుంది. 

వారికి ఒక వస్తువుపై నాలుగు రూపాయల ఆదాయం ఉంటుంది. 

అలాగే 20 రూపాయల వస్తువులు చాలా రకాలు ఉంటాయి.

వాటిని వారు 9 రూపాయలు నుండి 13 రూపాయల మధ్యలో కొనుగోలు చేస్తారు అప్పుడు వారికి యావరేజ్ గా 11 రూపాయలు పడుతుంది ఆ వస్తువులను వారు 20 రూపాయలకు విక్రయిస్తారు. 

కనుక ఈ వ్యాపారంలో ఎంత ఆదాయం ఉంటుందో మీకు అర్థమయ్యే ఉంటుంది. 

ఈ వ్యాపారాన్ని పట్టణాలు కాకుండా పల్లెటూర్లలో వ్యాపారం చేయడం అలవాటు చేసుకోండి అప్పుడు ప్రతిరోజు మనము మూడు వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు ఆదాయాన్ని సంపాదిస్తాం. 

ఈ వ్యాపారం పల్లెల్లో చేయాలంటే ఖచ్చితంగా ట్రాలీ ఆటో గాని ఏదైనా వాహనం కావాలి. 

ఆ వాహనం ద్వారా సరుకు మనం పల్లెటూర్లకు చేర్చుకొని విక్రయించవచ్చు. 

ఏదైనా ట్రాలీ వాహనం ఉన్న వ్యక్తులు ఈ వ్యాపారాన్ని 20 వేల రూపాయల పెట్టుబడితో ని ప్రారంభించవచ్చు అలాగే ఏ వాహనం లేని వ్యక్తి కూడా ఈ వ్యాపారాన్ని చేయవచ్చు. 

ప్రతి ఊర్లో ఎన్నో ట్రాలీ ఆటోలు మూడు చక్రాల అలాగే నాలుగు చక్రాలు మనకు కనబడుతూ ఉంటాయి. 

కొంతమంది ఆటో ఉన్నవారు బడుగుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి వారితో మీరు మాట్లాడుకోండి వ్యాపారం గురించి తెలియజేసి పెట్టుబడి మీరు చూసుకోండి. 

ఇద్దరూ కలిసి వ్యాపారం చేయండి వచ్చిన ఆదాయాన్ని ఖర్చులు  పోను సిరి సగం తీసుకోవడం అలవాటు చేసుకోండి అలా ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తుంటే ఒకరికి ₹2000 రూపాయల వరకు మిగులుతాయి. 

ఇలాంటి అద్భుతమైన వ్యాపారాన్ని ఎవరు వద్దనుకుంటారు ఖచ్చితంగా ఏ ట్రాలీ ఆటో వ్యక్తితో మీరు మాట్లాడిన ఒప్పుకుంటారు అలాగే ఈ వ్యాపారానికి కావలసిన వస్తువులు ఆంధ్రప్రదేశ్లో విజయవాడలోని వన్ టౌన్ మార్కెట్ నందు హోల్ సేల్ గా దొరుకుతాయి అలాగే తెలంగాణలోని హైదరాబాదు నందు బేగం బజార్ ఏరియా లో మీకు కావాల్సిన అన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు స్టీలు వస్తువులు అలాగే పది రూపాయల రేటులో మీరు అమ్మాలనుకుంటున్నా ఎన్నో వస్తువులు మీకు హోల్ సేల్ గా దొరుకుతాయి. 

వాటితో పాటుగా 20 రూపాయల రేటు మీరు అమ్మాలనుకుంటున్నా ఎన్నో రకాల వస్తువులు  తెలుగు రాష్ట్రాల్లో ని ఈ రెండు మార్కెట్ల యందు హోల్ సేల్ గా దొరుకుతాయి. 

ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే మీకు దగ్గరలోని హోల్సేల్ మార్కెట్ కు వెళ్లి ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో ఎంత మంది ఆ వస్తువులను హోల్ సేల్ గా విక్రయిస్తున్నారు ఒక అవగాహన చేసుకోండి అలాగే మన అమ్మే ప్రతి వస్తువు రెగ్యులర్గా ప్రతి ఇంట్లో వాడుతూ ఉంటారు. 

మీరు ముందుగానే ఇళ్లలో వాడే వస్తువులు ఒక అవగాహన తోటి పేపర్ పై రాసుకోండి ఆ తరువాత మీరు హోల్సేల్ మార్కెట్ కి వెళ్ళినప్పుడు మరికొన్ని కొత్త రకాలు మీకు కనపడతాయి వాటిని కూడా పేపర్ పై రాసుకోండి అలా రాసుకోవడం వల్ల మీకు సామాన్లు ఈజీగా అర్థమవుతుంది.

ఈ విధంగా అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేసి ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.


వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే ఆ వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలిసిఉండాలి అప్పుడే ఆ వ్యాపారంలో మీరు అద్భుతంగా రాణించగలరు.


కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.



***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close