20 వేల రూపాయలతో చెయ్యగలిగే జీడిపప్పు వ్యాపారం తెలుసుకుందాం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపారాలకు సంబంధించిన సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.
మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము.
వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాము.
ఈరోజు 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగి మరో అద్భుతమైన వ్యాపారం గురించి తెలియజేస్తాను.
మనలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రంగంలో ఎలాగైనా విజయం సాధించాలని ఉంటుంది కానీ అవగాహన లోపం వల్ల లేదా ఇంకేదైనా కారణం వల్ల వ్యాపారంలో చాలామంది రాణించలేకుండా ఉంటారు.
అలాంటి వారందరూ మొదటిగా తెలుసుకోవలసింది మనం ఏ వ్యాపారం చేస్తున్నామో ఆ వ్యాపారం గురించి మనకు ఎంతవరకు తెలుసు ఇంకా తెలుసుకోవలసినది ఏముంది అనే విషయంపై మీకు స్పష్టమైన అవగాహన ఉండాలి అప్పుడే మీరు చేస్తున్న వ్యాపారం లో రాణించగలుగుతారు.
కనుక వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగా ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి.
ఈరోజు 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే జీడిపప్పు వ్యాపారం గురించి మీకు తెలియజేస్తాను.
ఈ వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా ఏ ఊరు నుంచి అయినా ప్రారంభించవచ్చు.
ఎందుకంటే జీడిపప్పు వినియోగించే వ్యక్తులు ఈరోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు దానికి ప్రధాన కారణం ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడం.
ఇప్పుడు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండటం కోసం ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడటం లేదు.
జీడిపప్పు వ్యాపారం ఎంతో లాభదాయకమైన వ్యాపారం అలాంటి వ్యాపారాన్ని మనం ఎలా చేయాలో తెలుసుకుందాం.
తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ బైపాస్ లోని గొల్లపూడి మహాత్మా గాంధీ హోల్ సెల్ కమర్షియల్ కాంప్లెక్స్ నందు హోల్సేల్గా జీడిపప్పును విక్రయించే చాలా షాపులు ఉన్నాయి.
ఈ వ్యాపారాన్ని మీరు ప్రారంభించాలంటే జీడిపప్పు హోల్ సేల్ షాపులపై మనకు పూర్తి అవగాహన ఉండాలి.
ఎందుకంటే మనం జీడిపప్పును కస్టమర్లకు రీజనబుల్ రేట్లకు విక్రయించాలి కాబట్టి రీజనబుల్ రేటుకు కొనుగోలు చేయాలి అలా కొనుగోలు చేసినప్పుడే మనము ఈ వ్యాపారాన్ని చేయగలం.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకునే ప్రతి వ్యక్తి వారు ఉంటున్న ఊర్లో ఎన్ని చోట్ల రిటైల్గా జీడిపప్పును విక్రయిస్తున్నారో అలాంటి చిల్లర కోట్ల సమాచారం ముందే మనం తెలుసుకోవాలి.
అప్పుడు సరుకును విక్రయించడం మనకు ఈజీగా ఉంటుంది.
మీ ఊర్లో ఎన్ని కాలనీలు ఉన్నాయి అనే విషయంలో మీకు పూర్తి అవగాహన ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఒక బజారుకు రెండు లేదా మూడు చిల్లర కొట్లు కనిపిస్తాయి అలా అలా ఊరి మొత్తం తిరిగి ఎన్ని కిరాణా షాపులు ఉన్నాయో అన్ని ఏరియాలు రాసిపెట్టుకోండి.
ఆ తరువాత మీరు హోల్ సేల్ గ కొనుగోలు చేసిన జీడిపప్పును 50 గ్రాముల ప్యాకెట్ ల చేసుకొని ఆ ఇరవై 50 గ్రాముల ప్యాకెట్లు కలిపి ఒక పెద్ద ప్యాకెట్ చేసుకొని ప్రతి చిల్లర కొట్టు తిరిగి మీ దగ్గర ఉన్న సరుకు చూపించి హోల్ సేల్ గా విక్రయించండి.
ఈ విధంగా ఒక ప్యాకెట్ కి 100 రూపాయల ఆదాయం తీసుకున్నా మీరు ప్రతిరోజు 20 కేజీల ప్యాకెట్లు అమ్మగలుగుతారు.
ఆ విధంగా ప్రతి రోజు మీకు రెండు వేల రూపాయల పైనే ఆదాయం ఉంటుంది.
ఇలాంటి వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా వారి ఊర్లోనే ఉంటూ జాగ్రత్తగా చేసుకుంటే మంచి సంపాదన ఉంటుంది.
అలాగే ఈ వ్యాపారం పై మీకు ఏదైనా సొంత ఐడియా ఉంటే అలా చేసుకుంటూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు.
వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members