20 వేల రూపాయల పెట్టుబడితో మినరల్ వాటర్ వ్యాపారం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలి ఉద్దేశంతో వెబ్సైట్ను ప్రారంభించాను.
వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నాను.
ఈరోజు 20 వేల రూపాయలు పెట్టుబడి తో చేయగలిగే మంచి వ్యాపారం గురించి మాట్లాడుకుందాం.
చాలామంది ఇది ఎంతో కొంత ఆదాయం వస్తే బావుంటుంది అని అనుకుంటూ ఉంటారు అలాంటి వారందరికీ ఈ వ్యాపారం గురించి తెలియజేస్తాను.
ఫ్రెండ్స్ మనలో చాలా మంది ఎలాంటి వ్యాపారం అయినా అందిపుచ్చుకొని చేయాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారందరికీ ఇది మంచి వ్యాపారం అని చెప్పాలి.
ఈ వ్యాపారం చేయాలంటే 20 వేల రూపాయల పెట్టుబడితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లే ఈ వ్యాపారాన్ని చేయగలుగుతారు.
ఈరోజుల్లో మినరల్ వాటర్కు ఉన్న డిమాండ్ ఎంతో మనకు బాగా తెలుసు.
ప్రతి ఊర్లో మినరల్ వాటర్ ప్లాంట్స్ ఉంటాయి వాళ్లు వాళ్ళ వెహికల్ ద్వారా వాటర్ ను విక్రయిస్తూ ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు.
ఇప్పుడు మన ఊరికి దగ్గరలోని వాటర్ ప్లాంట్ వారి తోటి మీరు మాట్లాడండి సార్ నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది నేను వాటర్ సంబంధించిన వెహికిల్ ను నడపగలను అని వాటర్ ప్లాంట్ వారికి తెలియజేయండి అప్పుడు వారు మీ గురించి తెలుసుకుంటారు.
ఆ తర్వాత మీరు వారికి నచ్చితే 20 వేల డిపాజిట్ లేకుండానే మీకు వారి వెహికిల్ ఇచ్చి వాటర్ ని సప్లై చేయమంటారు.
మీరు వారికి తెలియక పోతే 20 వేల డిపాజిట్ వారికి కట్టండి అది అగ్రిమెంట్ రాయించుకొని ఆ తర్వాత వారు చెప్పిన షాపులకు మీరు వాటర్ సప్లై చేస్తూ ప్రతిరోజు వెయ్యి రూపాయల నుండి మూడు వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.
ఈ వ్యాపారాన్ని చెయ్యాలి అనే వ్యక్తులకు కష్టపడే మనస్తత్వం ఉండాలి అప్పుడే ఈ వ్యాపారాన్ని చేయగలరు.
మీరు ఎంత కష్టపడితే అంత ఈ వ్యాపారంలో సంపాదించగలరు.
వాటర్ ప్లాంట్ వారితో సుంబంధంలేకుండా ఈ వ్యాపారం చేయలేము ఎందుకంటే మనం వాటర్ ప్లాంట్ పెట్టుకోవాలి దానికి ఎంత ఖర్చు అవుతుందో కనుక్కోవాలి.
అలా కాకుండా ముందునుండి ఇ వాటర్ ప్లాంట్ ఉన్న వ్యక్తుల తోటి మాట్లాడుకోవడం వల్ల మనకు ఎటువంటి పెట్టుబడి లేకుండా వ్యాపారం చేసుకుని అవకాశం ఉంటుంది.
మనము ఎంతైనా సంపాదించగలిగితే అవకాశం కూడా ఉంటుంది.
ఇలాంటి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఊరిలో వాటర్ ప్లాంట్ లు ఉంటాయి వాటర్ ప్లాంట్ వారు వెహికల్ నడిపి వాటర్ ను విక్రయించే వారికోసం ఎదురుచూస్తూ ఉంటారు కనుక ఎక్కడ ఏ వాటర్ ప్లాంట్ వారితో మీరు మాట్లాడిన మీకు మంచి వ్యాపారం చేసుకునే అవకాశం దొరుకుతుంది.
ఫ్రెండ్స్ ఏ వ్యాపారం గురించైనా పూర్తిగా తెలుసుకున్నప్పుడే మన వ్యాపారం లో అద్భుతంగా రాణించగలుగుతారు.
వ్యాపారాన్ని ప్రారంభించే ముందు గానే పూర్తి సమాచారం తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members