కొబ్బరి బొండాల వ్యాపారం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్సైట్ను ప్రారంభించాను.
వ్యాపారానికి సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాను.
ఈరోజు ఎటువంటి పెట్టుబడి లేని కొబ్బరి బొండాల వ్యాపారం గురించి మాట్లాడుకుందాం.
చాలామందికి ఆశ్చర్యం అనిపించింది , పెట్టుబడి లేకుండా ఎలా వ్యాపారం చేస్తారు అని కూడా అడగలేదు దానికి సరైన సమాచారం అలాగే సరైన వివరాలు తెలియజేస్తను.
ఈరోజుల్లో ఏ వ్యాపారం పెట్టుబడి లేకుండా చేయలేము కానీ కొబ్బరి బొండాల వ్యాపారం ఎటువంటి పెట్టుబడి లేకుండా చేయవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.
మనం ఉంటున్న ప్రతి ఊరికి ఏదో ఒక పెద్ద ఊరు ఉంటుంది అలాగే కొబ్బరి బోండాలు హోల్సేల్గా అమ్మే వ్యక్తులు ఉంటారు.
వారు హోల్సేల్గా కొబ్బరిబొండాలు విక్రయిస్తారు.
అలాంటివారికి వారి వ్యాపారాన్ని చేసే మనుషులు దొరకడమే కష్టంగా ఉంటుంది కనుక వారు నమ్మకంగా పనిచేసే వ్యక్తుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.
మీరు హోల్ సేల్ గా కొబ్బరిబొండాలు విక్రయించే వారితో మాట్లాడి మీరు ఎటువంటి పెట్టుబడి లేకుండా వారి తరపున మీరు కొబ్బరిబొండాలు విక్రయించవచ్చు.
ప్రతిరోజు మీకు వెయ్యి రూపాయల వరకు ఆదాయం ఇస్తారు.
అలాగే 20 వేల రూపాయలు పెట్టుబడి మీరు పెట్టగలిగితే కొబ్బరి బోండాలు కొనుగోలు చేసి మీరు ఉంటున్న ఊర్లో విక్రయిస్తూ మంచి ఆదాయం సంపాదించవచ్చు.
నేను వీడియోలో ఎలా విక్రయించాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాను ఆ వీడియో చూసి కొబ్బరి బోండాలు ఎలా విక్రయించాలి అనే విధానాన్ని తెలుసుకోండి.
ఈ వ్యాపారం ద్వారా ప్రతి వ్యక్తి ఎంతో అద్భుతమైన ఆదాయాన్ని సంపాదిస్తాడు కనుక ఈ వ్యాపారాన్ని ఎవరైనా చేయవచ్చు.
అలాగే పెట్టుబడి లేకుండా కూడా చేయవచ్చు కాకపోతే కొబ్బరి బోండాలు హోల్ సేల్ గా అమ్మే వ్యక్తితో మీరు మాట్లాడి వారిని ఒప్పించగలిగితే సరిపోతుంది.
ఇలాంటి వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా ఏ ఊరు నుండి ఐనా ప్రారంభించవచ్చు.
ఈ వ్యాపారానికి ఎలాంటి చదువు అవసరం లేదు ఎదుటి వ్యక్తి తో మాట్లాడే నైపుణ్యం ఉంటే సరిపోతుంది.
వ్యాపారం ప్రారంభించే ముందు గానే వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోండి అప్పుడే మీరు ఎక్కడైనా ఈ వ్యాపారం రాణించగలుగుతారు.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఇవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members