Start best wholesale business

తక్కువ పెట్టుబడి తో చేయగలిగే హోల్ సేల్ వ్యాపారం :-


అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము వ్యాపారాలు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాను. 

ఈరోజు తక్కువ పెట్టుబడి తో చేయగలిగే హోల్సేల్ వ్యాపారం తెలుసుకుందాం. 

చాలామంది మెయిల్ ద్వారా అడుగుతున్నారు అలాంటి వారందరూ ఈ వ్యాపారం గురించి ఆలోచించండి. 

ఈ వ్యాపారానికి లక్ష రూపాయల నుండి రెండు లక్షల రూపాయల వరకు పెట్టుబడి అవసరమవుతుంది. 

ఈ వ్యాపారాన్ని మీరు మీ ఊరు నుండి ప్రారంభించవచ్చు.

మనము మన ఇంటిలో ఎన్నో రకాల ప్లాస్టిక్ వస్తువులు వినియోగిస్తూ ఉంటాము వాటిలో ముఖ్యమైనది లెట్రిన్ బ్రష్ , సింక్ బ్రష్ అలాగే బాటిల్ బ్రష్ ఇలా మనము నిత్యం వాడే ఎన్నో రకాల బ్రష్ లను హోల్ సేల్ గా కొనుగోలు చేసి  రిటైల్గా షాపులకు విక్రయించడం. 

మార్కెట్లో మనకు లెట్రిన్ బ్రష్ చాలా రకాలు ఉంటాయి వాటిని హోల్ సేల్ గా కొనుగోలు చేసి మనం ఉంటున్న జిల్లాలోని అన్ని రకాల ఫాన్సీ షాపులకు విక్రయించడం. 

ఈ వ్యాపారంలో 30% వరకు ఆదాయం ఉంటుంది. 

అలాగే సరుకు పాడై పోతుందేమో అనే ఆలోచన అవసరం లేదు ఎందుకంటే మనము కొనుగోళ్లలో జాగ్రత్త తీసుకుంటే ట్రాన్స్ పోర్ట్ లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా సరుకు మన వద్దకు వస్తుంది. 

అలాగే కొంత ఎక్కువ కాలం మన వద్ద ఉన్న ఎటువంటి ఇబ్బంది లేదు కనుక ఈ వ్యాపారానికి ఎలాంటి వేస్టేజీ ఉండదు. 

మీరు ఉంటున్న జిల్లాలో దాదాపుగా 500 వరకు ఫాన్సీ షాపులు ఉంటాయి వాటన్నిటికీ మీరు మీ సరుకును విక్రయించవచ్చు. 

ఈ వ్యాపారాన్ని మీరు ఉంటున్న ఊరు నుండి మీ ఇంటి నుండి ప్రారంభించండి. 

ఎలాంటి షాపు రెంటుకు తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక ఎటువంటి అదనపు ఖర్చులేకుండా వ్యాపారాన్ని ప్రారంభించి మంచి ఆదాయం సంపాదించవచ్చు. 

ఈ వ్యాపారం గురించి అలాగే వ్యాపారం చేసి విధానం గురించి పూర్తిగా వీడియోలో తెలియజేశాను ఆ వీడియో  ఒకసారి చూడండి అప్పుడు వ్యాపారం ఎలా చేయాలో మీకు అర్థమవుతుంది. 

అలాగే మీకు ఏదైనా సొంత అవగాహన ఉంటే ఆ విధంగా కూడా మీరు వ్యాపారం చేసుకోవచ్చు. 

ఈ వ్యాపారంలో మీరు హోల్సేల్గా విక్రయించే సరుకు ఫ్యాన్సీ షాప్ వారికి అప్పు ఇవ్వకుండా వ్యాపారం చేయండి.

అప్పు ఇవ్వకపోవడం వల్లనే మీ వ్యాపారం బాగా జరుగుతుంది. 

అలా కాకుండా షాపులో వారికి అప్పు అలవాటు చేస్తే మీ పెట్టుకుని సరిపోకపోవచ్చు అలాగే షాపు వారి వద్దనుండి అప్పు రాకపోవచ్చు.  

మీరు క్యాష్ కు విక్రయించడం అలవాటు చేసుకుంటే నిదానంగా ప్రతి షాపు వారికి క్యాష్ కు కొనడం అలవాటవుతుంది. 

అలా మీ వ్యాపారం దినదిన అభివృద్ధి చెందుతుంది కనుక ఈ వ్యాపారం ఏ వ్యక్తి అయినా ఏ ఊరు ప్రారంభించవచ్చు.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడలోని వన్ టౌన్ ఏరియా నందు హోల్ సేల్ షాప్ లు ఉన్నాయి వారి వద్ద నుండి మీకు కావలసిన సరుకులు కొనుగోలు చేయవచ్చు. 

అలాగే హైదరాబాదులోని బేగం బజార్ నందు హోల్ సేల్ షాప్ లు ఉన్నాయి వారి వద్ద నుండి కూడా మీకు కావాల్సిన సరుకులను కొనుగోలు చేయవచ్చు. 

ఈ వ్యాపారంలో సరుకు కొనుగోలులో మీ నేర్పరితనము చూపించండి ఎందుకంటే మనము హోల్సేల్ వ్యాపారం చేస్తాము కనుక ఒకటికి రెండు సార్లు తిరిగి ఎక్కడ మనకు రేటు తక్కువగా వస్తుందో అక్కడ నుండి మాత్రమే కొనుగోలు చేయండి అప్పుడే మీకు మంచి లాభాలు ఉంటాయి.


వ్యాపారం ప్రారంభించే ముందు గానే పూర్తి సమాచారం తెలుసుకుని వ్యాపారం ప్రారంభించండి.


కొత్త కొత్త వ్యాపార అ సమాచారం కోసం వెబ్సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.



***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close