T shirts business

 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే బనిన్ క్లాత్ వ్యాపారం :-


అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. 

మరికొంత సమాచారాన్ని తెలియచేయాలి అని ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాను. 

వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు ఇతర సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాను. 

ఈరోజు 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే బనియన్ క్లాత్ నైట్ డ్రెస్ ల వ్యాపారం తెలుసుకుందాం. 

ఈ వ్యాపారంలో ఎక్కువ ఆదాయం ఉంటుంది అలాగే తక్కువ పెట్టుబడి తో చేయగలం కనుక ఈ వ్యాపారాన్ని ప్రతి ఒక్కరికి అద్భుతమైన వ్యాపారం అని అనుకోవచ్చు. 

ఫ్రెండ్స్ ఈ వ్యాపారానికి సంబంధించిన బనియన్ క్లాత్ డ్రెస్సులు తెలుగు రాష్ట్రాలలో హోల్ సేల్ గా కొనుగోలు చేయవచ్చు. 

తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాదులోని బేగం బజార్ ఏరియా లో బనియన్ క్లాత్ డ్రెస్సులమే హోల్ సేల్ షాప్ లు ఉన్నాయి. 

అన్ని షాపులు తిరిగి ఎక్కడ రేటు తక్కువ వస్తే అక్కడ నుండి మనము సరుకు కొనుగోలు చేయవచ్చు. 

అలాగే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడలోని వన్ టౌన్ నందు బనిన్ క్లాత్ అమ్మే షాపులు ఉన్నాయి. 

కొత్తగా వ్యాపారం చేయాలనుకున్న వ్యక్తులు ముందుగా హోల్సేల్ మార్కెట్ కు వెళ్లి అన్ని షాపులు పరిశీలించి ఎక్కడ ఏ రేటు విక్రయిస్తున్నారు అనే అవగాహన పెంచుకుని వ్యాపారం ప్రారంభించవచ్చు. 

ఈ వ్యాపారాన్ని ఏ వ్యక్తి అయినా ఏ ఊరు నుండి అయినా ప్రారంభించవచ్చు. 

ఈ వ్యాపారానికి మీరు ఒక ఎక్సెల్ బండి తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ వ్యాపారం ఎక్కువగా పల్లెల్లో జరుగుతుంది కనుక ఒక మోటార్ సైకిల్ ఉంటే ఆ మోటార్సైకిల్లో సరుకు నింపుకొని పలేలు తిరుగుతూ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. 

ఈ వ్యాపారంలో అధిక ఆదాయం ఉంటుంది కనుక వ్యాపారం కోసం తిరిగే టప్పుడు మోటార్ సైకిల్ కు పెట్రోల్ కొంత ఖర్చు అయినా ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే ఖర్చులన్నీ పోను కూడా ప్రతిరోజు రెండు లేదా మూడు వేల రూపాయలు సంపాదించవచ్చు. 

కనుక వ్యాపారం చేయాలి అనే ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తి అలాగే తక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేయాలి అనుకునే వ్యక్తులు అలాగే కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఈ వ్యాపారం గురించి ఆలోచించవచ్చు. 

ఈ వ్యాపారంలో మనము సరుకు కొనుగోలు చేయడంలోనే మెలకువగా ఉండాలి. 

ఎందుకంటే ఎక్కువ రేటు కొనుగోలు చేస్తే మనం ఆదాయంలో నష్టపోతారు కనుక ఒకటికి పది సార్లు తిరిగి 10 షాపులో ఎంక్వయిరీ చేసి ఎక్కడ తక్కువ వస్తే అక్కడ నుండి సరుకు కొనుగోలు చేయండి.



వ్యాపారాన్ని ప్రారంభించే ముందు పూర్తి సమాచారం తెలుసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి.


కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి.

***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close