20 వేల రూపాయల పెట్టుబడితో టీ స్టాల్ వ్యాపారం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్సైట్ ప్రారంభించాము.
వ్యాపారానికి సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాను.
ఈరోజు ప్రతి వ్యక్తికి ఆదాయం అవసరం అలాగే ప్రతి వ్యక్తి ఏదో ఒక రంగంలో స్థిరపడాలని అనుకుంటాడు కానీ అతను అనుకున్న రంగం గురించి పూర్తిగా తెలుసుకోకపోవడం వల్ల ఆ వ్యాపారంలో వెనుకబడి పోతుంటాడు.
ఈరోజు నేను మీకు 20 వేల రూపాయల పెట్టుబడితో చేయగలిగే టీ స్టాల్ వ్యాపారం తెలియజేస్తాను.
ప్రారంభించినరోజు నుండి ఆదాయం వచ్చే వ్యాపారాల్లో చాలా మంచి వ్యాపారం టీ స్టాల్ వ్యాపారం.
ఈ వ్యాపారాన్ని టెక్నిక్తో చేయవలసి ఉంటుంది ఎందుకంటే టెక్నిక్ లేకుండా ఈ వ్యాపారం చేస్తే గెలవడం కష్టం అవుతుంది.
మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించేముందుగానే మీరు ఉంటున్న ఊర్లో ఏ సెంటర్ లో టీ స్టాల్ వ్యాపారాన్ని ప్రారంభించాలి అనే అవగాహన మీకు ముందే ఉండాలి.
అలాగే మీ ఊరి నందు టీ స్టాల్స్ పరిశీలించండి వారు ఏవిధంగా అమ్ముతున్నారు అనే విషయం గమనించండి.
మీరు భిన్నంగా విక్రయించాలి అప్పుడే మీ దగ్గర టీ తాగడానికి ఎక్కువ మంది వస్తారు.
నాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియజేస్తాను మీరు టీ స్టాలు ప్రారంభించే ముందుగానే నేను తెలియజేసే సమాచారాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి.
ఈరోజుల్లో మీరు ఎక్కడ టీ స్టాల్ ప్రారంభించిన కొత్తరకంగా టీ తయారు చేసి అమ్మాలి.
చాలామంది టీ స్టాల్ వ్యక్తులు తక్కువ రకం టీ పొడి వినియోగిస్తారు అలా చేయడం వల్ల టీ క్వాలిటీ తగ్గిపోతుంది అలా కాకుండా మంచి క్వాలిటీ టీ పొడిని మార్కెట్ అంతా తిరిగి కొనుగోలు చేయండి అలాగే పాల ప్యాకెట్ ను వాటర్ కలపకుండా డైరెక్ట్ గా టీ పొడి వేసి కస్టమర్ ముందే టీ పెట్టి ఇవ్వండి అప్పుడు మీరు ఇచ్చిన టి ఎంతోరుచిగా ఉంటుంది.
కస్టమర్ మళ్లీ మళ్లీ మీ షాపు వద్దకు వచ్చి టీ తాగుతారు.
ఎలాంటి వాటర్ కలపకుండా మీరు అప్పటికప్పుడు టీ రెడీ చేసి ఇస్తారు కనుక మీకోసం మీ షాపు వద్ద కస్టమర్ ఎదురుచూస్తారు కనుక టీ తయారు చేసే విషయంలో కాంప్రమైజ్ కాకండి.
అలా మీరు టీ విక్రయించిన ప్రతి వంద రూపాయలు అమ్మకానికి మీకు 40 రూపాయల ఆదాయం ఉంటుంది.
ఈరోజు ఆ విధంగా మీరు టీ తయారు చేసి ఇస్తే అప్పుడది కప్పుకు పది రూపాయలు కస్టమర్ ఇస్తారు కనుక మీకు మీ వ్యాపారానికి ఎప్పటికీ ఇబ్బంది ఉండదు.
రీజనబుల్ ఆదాయానికి టీ షాపు నడిపిన అంతకాలం మీకు ఎప్పుడు వ్యాపారం ఉంటుంది.
ఫ్రెండ్స్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అనే విషయం మీకు అర్ధం అయి ఉంటుంది ఒకసారి యూట్యూబ్ కి వెళ్లి నేను చెప్పిన వీడియోలు కూడా చూడండి అప్పుడు మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది.
వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకొని వ్యాపారాన్ని ప్రారంభించండి.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members