యాపిల్ వ్యాపారం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.
వ్యాపారాలకు సంబంధించిన మరి కొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలని వెబ్సైట్ను ప్రారంభించాను.
వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాను.
ఈరోజు ఏ వ్యక్తి అయినా ఏ ఊరిలో నైనా చేయగలిగే యాపిల్ వ్యాపారం గురించి తెలుసుకుందాం.
ఈ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి అలాగే తక్కువ పెట్టుబడి అవుతుంది.
ఈ వ్యాపారాన్ని రెండు విధాలుగా చేయవచ్చు రిటైల్ అలాగే హోల్సేల్.
మీరు ఉంటున్న ఊర్లో ఆపిల్ వ్యాపారం చేసే ఎంతోమంది మీకు కనిపిస్తూ ఉంటారు వారందర్నీ దృష్టిలో పెట్టుకొని మీరు యాపిల్ వ్యాపారాన్ని హోల్ సేల్ గా చేసుకోవచ్చు అలాగే రిటైల్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు.
తెలుగు రాష్ట్రాలలో యాపిల్ హోల్సేల్ మార్కెట్ లు విజయవాడలో ఫ్రూట్ మార్కెట్ ఒకటి ఉంది అలాగే హైదరాబాదులో కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో రెండు హోల్సేల్ మార్కెట్ లు ఉన్నాయి.
వీటితోపాటుగా చెన్నై కోయంబేడు హోల్ సేల్ మార్కెట్ ఉంది.
ఈ మూడు మార్కెట్లు యాపిల్ను హోల్ సేల్ గా విక్రయిస్తాయి.
మీరు వ్యాపారాన్ని ప్రారంభించే ముందు నేను తెలియ చేసిన 3 మార్కెట్లో తిరగండి ఎక్కడ ఏ రేటు విక్రయిస్తున్నారు ఎక్కడ ఏ క్వాలిటీ సరుకు మనకు అందుబాటులో ఉంది అనే విషయంపై మీకు అవగాహన వస్తుంది ఆ తర్వాత మీరు ఎక్కడ నుండి అయినా యాపిల్ను కొనుగోలు చేయవచ్చు.
హోల్సేల్ మార్కెట్లో ఎంతోమంది హోల్ సేల్స్ షాపులు రన్ చేస్తూ ఉంటారు వారంతా యాపిల్ హోల్ సేల్ గా అమ్ముతూ ఉంటారు అలా హోల్సేల్గా అమ్మే వారి అందరితో మీరు మాట్లాడండి ఎక్కడ ఏ రేటు వస్తుందో తెలుసుకోండి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తారో తెలుసుకోండి ఎందుకంటే మనం ఉంటున్న ఊరికి మనం కొనుగోలు చేసిన యాపిల్ రావాలి కనుక అన్ని విషయాలు తెలుసుకొని ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి.
రిటైల్గా మీరు ఉంటున్న ఊర్లో ఒక ప్రదేశాన్ని సెట్ చేసుకోండి అక్కడ నుండి రిటైల్ వ్యాపారం ప్రారంభించండి అలాగే మీరు కొనుగోలు చేసిన యాపిల్ ఒక బాక్స్ ఎంత రేటు పడుతుందో అలాగే ఎన్ని కేజీలు వెయిట్ వస్తుందో అలాగే ఒక బాక్స్ కు మీకు ఖర్చు ఎంత అయ్యాయో చూసుకొని తక్కువ ఆదాయాన్ని తీసుకొని హోల్ సేల్ గా అమ్మండి.
మీరు ఇచ్చిన రేటు హోల్ సేల్ గా యాపిల్ కొనే వ్యక్తికి ఎక్కడ రాదు కనుక మీ వద్ద నుండి సరుకు కొనుగోలు చేస్తాడు ఈ విధంగా హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకోండి.
వ్యాపారం ప్రారంభించే ముందుగానే వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members