స్థిరమైన మంచి హోల్సేల్ వ్యాపారం :-
అందరికీ నమస్కారం
కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను.
మరికొంత ఎక్కువ సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్ సైట్ ప్రారంభించాము.
వ్యాపారాలకు సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాను.
ప్రతి ఒక్కరూ ఏదైనా మంచి స్థిరమైన వ్యాపారాన్ని కోరుకుంటారు.
అలాంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ ఫర్నిచర్ వ్యాపారం గురించి ఆలోచించవచ్చు.
ఫర్నిచర్ వ్యాపారానికి పెట్టుబడి ఎక్కువ అవుతుంది అలాగే ఆదాయం కూడా ఎక్కువగానే ఉంటుంది.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఈ వ్యాపారం గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి అప్పుడే ఫర్నిచర్ వ్యాపారంలోని సాధకబాధకాలు మనకు అర్థం అవుతాయి.
అలా అర్ధమైనపుడే మనము ఫర్నీచర్ వ్యాపారంలో అద్భుతంగా రాణించవచ్చు.
ఏదైనా మండల కేంద్రం నుండి పెద్ద టౌన్ లను వ్యాపార కేంద్రాలుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి.
మీరు ఎంచుకున్న ఊరిని బట్టి మీ పెట్టుబడి ఉంటుంది.
మీరు ఏదైనా మండల కేంద్రంలో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే రెండు లక్షల రూపాయల నుండి ఐదు లక్షల రూపాయల పెట్టుబడి వరకూ సరిపోతుంది.
అలాగే ఏదైనా నియోజకవర్గంలో ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే 5 లక్షల నుండి పది లక్షల వరకు పెట్టుబడి అవుతుంది.
అలాగే జిల్లా కేంద్రంలో ఫర్నిచర్ వ్యాపారం ప్రారంభించాలంటే 10 లక్షల నుండి 20 లక్షల వరకు అవుతుంది.
ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు పెట్టుబడి తో పాటుగా ఖర్చులు కూడా బేరీజు వేసుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు ఈ వ్యాపారం జరగకపోవచ్చు కనుక మనకు నెల మొత్తానికి షాపు రెంటు ఎంత అవుతుంది అలాగే కరెంటు బిల్లు ఎంత అవుతుంది ఇతర ఖర్చులు ఏమైనా ఉంటాయా అనే విషయం పై మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి అప్పుడే మనం ఫర్నిచర్ వ్యాపారాన్ని అద్భుతంగా చేయగలుగుతాము.
ఈ వ్యాపారం ఎప్పుడో ఒకసారి జరిగిన అప్పుడు అద్భుతమైన ఆదాయం ఉంటాయి.
ఈ వ్యాపారంలో ఎక్కువగా డబల్ కాట్ మంచాలు సింగిల్ కాట్ మంచాలు డ్రెస్సింగ్ టేబుల్స్ డైనింగ్ టేబుల్స్ టీపాయ్ అలాగే పరుపులు దిండ్లు మనం విక్రయించవచ్చు.
వాటితో పాటుగా బీరువాలను కూడా విక్రయించవచ్చు.
మండల కేంద్రంలో అయితే ఎన్నో రకాల వస్తువులను ఒకే షాపు ద్వారా విక్రయించవచ్చు.
కనుక ఫర్నిచర్ వ్యాపారాన్ని ప్రారంభించకముందే ఆ వ్యాపారానికి సంబంధించిన పూర్తి సమాచారం మనం తెలుసుకోవాలి అప్పుడే మనం వ్యాపారంలో రాణించగలుగుతాము.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే విజయవాడ లో ఫర్నిచర్ హోల్ సేల్ షాప్ లు ఉన్నాయి ఫర్నిచర్ హోల్ సేల్ గా విక్రయించే వారే ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లను నడుపుతూ ఉంటారు కనుక మనకు రకరకాల మోడల్స్ లను విక్రయిస్తారు.
ఈ వ్యాపారాన్ని మనము ప్రారంభించకముందు హోల్సేల్ మార్కెట్ కు వెళ్లి ఫర్నిచర్ ఎన్ని రకాలు ఉన్నాయి ఎంత రేట్లు ఉన్నాయి ఎక్కడ తకువకి ఇస్తున్నారు అనే తెలుసుకోవాలి.
మనం వ్యాపారం చేసే దగ్గర ఎంత రేటు కు మనము అమ్మగలము అనే విషయంపై పూర్తి అవగాహన ఉండాలి అప్పుడే ఈ వ్యాపారం లో మనకు మంచి ఆదాయం ఉంటుంది.
తెలంగాణ విషయానికొస్తే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చాలా ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి బేగం బజార్ ఏరియా లో ఫర్నిచర్ హోల్ సేల్ గా విక్రయించే షాపులు ఉన్నాయి వారి ద్వారా మనకు కావాల్సిన ఫర్నిచర్ ను కొనుగోలు చేయవచ్చు.
ఈ విధంగా ఈ వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకుంటూ అద్భుతమైన ఆదాయాన్ని సంపాదించవచ్చు.
వ్యాపారాన్ని ప్రారంభించే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకుని వ్యాపారాన్ని ప్రారంభించండి.
కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.
***అందరికీ ధన్యవాదములు***
0 Comments
please share this website to your friends and family members