Rice business in telugu

తక్కువ పెట్టుబడితో రైస్ వ్యాపారం :-

అందరికీ నమస్కారం

కొత్త కొత్త వ్యాపార సమాచారాన్ని గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను మరికొంత అదనపు సమాచారాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వెబ్సైట్ను ప్రారంభించాను వ్యాపారానికి సంబంధించిన అడ్రస్ లను మరియు అదనపు సమాచారాన్ని వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తున్నాను. 

ఈరోజు తక్కువ పెట్టుబడి తో రైస్ వ్యాపారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. 

ఈ వ్యాపారాన్ని ఎవరైనా  ఏ ఊరు నుండి అయినా చేసుకోవచ్చు. 

ఈరోజుల్లో అందరూ ఆహారంగా వినియోగించేది రైసు అలాంటి రైస్ వ్యాపారాన్ని మనం ఎంచుకుంటే ఎంతో అద్భుతమైన ఆదాయాలు ఉంటాయి. 

మనం ఉంటున్న ఊర్లో చాలా రైస్ షాపులు ఉంటాయి వారు ఎన్నోరకాల బియాలను విక్రయిస్తూ అంటారు. 

ప్రజలు ఎక్కువగా వినియోగించే బియ్యం ఎంటో తెలుసుకొని ఆ రకం బియ్యాన్ని హోల్సేల్ మార్కెట్ నుండి కొనుగోలు చేసి మన ఇంటి వద్ద నుండి వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.

ఈరోజుల్లో ఎక్కువ వాడే బియ్యం సన్న సోనామసూరి బియ్యం. 

చాలామంది ఈ బియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తారు కనుక మనం సోనా మసూరి బియ్యం ఐదు కేజీల ప్యాకెట్ల రూపంలో అలాగే పది కేజీల ప్యాకెట్ రూపంలో తయారుచేసుకుని మనం ఉంటున్న ఊర్లో విక్రయించడం. 

చాలామంది రోజువారీ పని చేసేవారు అలాగే చిన్న చిన్న షాపుల వాళ్ళు అలాగే బండ్ల మీద కూరగాయలు పండ్లు విక్రయించే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్లని లక్ష్యంగా చేసుకొని మనం మన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

ప్రతి ఒక్కరికి బియ్యం అవసరం ఉంటుంది చాలామందికి బస్తాలు కొని తెచ్చుకునే స్తోమత ఉండకపోవచ్చు అలాంటి వారు ఏ రోజుకారోజు బియ్యాన్ని కొనుగోలు చేస్తారు. 

అలాంటి వారితో మీరు మాట్లాడండి బియ్యాన్ని 10 కేజీలు ఐదు కేజీల రూపంలో నేను విక్రయిస్తున్నానని తెలియజేయండి. 

వారికి రైస్ అప్పుగా ఇస్తాను అని తెలియజేయండి. 

తీసుకున్న ఒకే సారి డబ్బు కాకుండా రోజుకు ఎంతో కొంత ఇవ్వండి అని తెలియజేయడం వల్ల ప్రతి ఒక్కరూ మీ దగ్గర నుండి బియ్యం కొనుగోలు చేస్తారు. 

10 కేజీలు ఉన్న వ్యక్తి కేజీ 50 రూపాయల కింద 500 రూపాయల ఖరీదు అవుతుంది అప్పుడు వారు ప్రతిరోజు 50 రూపాయల కింద మీకు జమ చేస్తూ వస్తారు పది రోజుల కల మీ అప్పు తీరిపోతుంది. 

మళ్ళీ పది కేజీల బియ్యం తీసుకుంటారు ఈ విధంగా ప్రతి రోజు 50 రూపాయల కింద జమ చేస్తూ వస్తుంటారు. 

ఇలా మన వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది. 

మనము ఇలా ప్రతి వ్యక్తికి తెలియజేయడం వల్ల మనము ప్రతిరోజు రెండు వేల కేజీల దాకా బియ్యాన్ని అమ్మవచ్చు.

కేజీకి రెండు రూపాయల ఆదాయం ఉన్నా ప్రతిరోజు మనకు నాలుగు వేల రూపాయల పైగా ఆదాయం ఉంటుంది. 

అలాగే ఈ వ్యాపారం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరికి అవసరమైన బియ్యాన్ని అప్పుగా ఇచ్చి వారి వద్ద నుంచి ప్రతిరోజు కొంత కొంత ఇస్తారు కనుక మీ వ్యాపారానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. 

సరైన విధానంతో ఈ వ్యాపారం అలవాటు చేసుకుని ప్రతిరోజు పది మందిని కలుస్తూ వారికి కావాల్సింది సప్లై చేస్తూ వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేసుకుంటూ మీ వ్యాపారాన్ని బాగా అభివృద్ధి పరుచుకోండి. 

అతి తక్కువ పెట్టుబడి తో ఈ వ్యాపారాన్ని మీరు ఉంటున్న ఊరు నుండి చేసుకోవచ్చు.  

ఇప్పుడు నేను చెప్పిన వ్యాపారానికి ఎటువంటి  కాంపిటీషన్ ఉండదు కనుక మీరు ఈ వ్యాపారాన్ని ఏ ఊరు నుండి ఐనా ప్రారంభించవచ్చు.


ఏ వ్యాపారమైన దనిగురించి పూర్తిగా తెలుసుకొని ఆ వ్యాపారాన్ని ప్రారంభించాలి అప్పుడే ఆ వ్యాపారంలో మనం అభివృద్ధి సాధించవచ్చు.

వ్యాపారం ప్రారంభించే ముందుగానే ఆ వ్యాపారం గురించి పూర్తిగా తెలుసుకోండి.


కొత్త కొత్త వ్యాపార సమాచారం కోసం వెబ్ సైట్ ఫాలో అవ్వండి అలాగే యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి.

***అందరికీ ధన్యవాదములు***

Post a Comment

0 Comments

close